కరోనా ..ఢిల్లీలో శాస్త్రి భవన్ పాక్షికంగా మూసివేత

| Edited By: Pardhasaradhi Peri

May 05, 2020 | 6:41 PM

ఢిల్లీ లోని శాస్త్రి భవన్ లో న్యాయ మంత్రిత్వ శాఖకు చెందిన ఓ సీనియర్ అధికారికి కరోనా పాజిటివ్ లక్షణాలు సోకడంతో ఈ భవనాన్ని పాక్షికంగా సీల్ చేశారు.  దీన్ని శానిటైజ్ చేసే పనిని ప్రారంభించారు.   ఈ భవనంలో రెండో అంతస్తులో ఉంటున్న  ఈ అధికారి ఎవరెవరితో కాంటాక్ట్ లోకి వచ్చాడో తెలుసుకుంటున్నారు. ఈ ఆఫీసులోని లిఫ్టులను కూడా సీల్ చేసినట్టు అధికారులు తెలిపారు. ఇటీవలే నీతి ఆయోగ్ భవనాన్ని 48 గంటల పాటు మూసివేసిన విషయం […]

కరోనా ..ఢిల్లీలో శాస్త్రి భవన్ పాక్షికంగా మూసివేత
Follow us on

ఢిల్లీ లోని శాస్త్రి భవన్ లో న్యాయ మంత్రిత్వ శాఖకు చెందిన ఓ సీనియర్ అధికారికి కరోనా పాజిటివ్ లక్షణాలు సోకడంతో ఈ భవనాన్ని పాక్షికంగా సీల్ చేశారు.  దీన్ని శానిటైజ్ చేసే పనిని ప్రారంభించారు.   ఈ భవనంలో రెండో అంతస్తులో ఉంటున్న  ఈ అధికారి ఎవరెవరితో కాంటాక్ట్ లోకి వచ్చాడో తెలుసుకుంటున్నారు. ఈ ఆఫీసులోని లిఫ్టులను కూడా సీల్ చేసినట్టు అధికారులు తెలిపారు. ఇటీవలే నీతి ఆయోగ్ భవనాన్ని 48 గంటల పాటు మూసివేసిన విషయం విదితమే.. అంతకు ముందు రాజీవ్ గాంధీ భవన్, సీఆర్పీఎఫ్, బీ ఎస్ ఎఫ్ కార్యాలయాలను కూడా మూసి వేశారు. సీ ఆర్ పీ ఎఫ్ జవాన్లలో సుమారు వంద మందికి పాజిటివ్ లక్షణాలు సోకినట్టు వార్తలు వచ్చాయి.