దేశ రాజధానిలో తగ్గుముఖం పట్టిన కరోనా

దేశ రాజధాని ఢిల్లీలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టింది. గత వారం రోజులుగా కరోనా పాజిటివ్‌ కేసులు రోజురోజుకు నెమ్మదిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 674 కరోనా  పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో..

దేశ రాజధానిలో తగ్గుముఖం పట్టిన కరోనా

Updated on: Aug 04, 2020 | 10:41 PM

దేశ రాజధాని ఢిల్లీలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టింది. గత వారం రోజులుగా కరోనా పాజిటివ్‌ కేసులు రోజురోజుకు నెమ్మదిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 674 కరోనా  పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు ఢిల్లీ వ్యాప్తంగా నమోదైన కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,39,156కి చేరింది. ఇక వీటిలో కరోనా నుంచి కోలుకుని
1,25,226 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. మంగళవారం నాడు ఢిల్లీ వ్యాప్తంగా 972 మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ విషయాన్ని ఢిల్లీ ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇక గడిచిన 24 గంటల్లో కరోనా బారినపడి 12 మంది మరణించారు. దీంతో ఇప్పటి వరకు ఢిల్లీ వ్యాప్తంగా 4,033 మంది మరణించారు.

కాగా, మంగళవారం నాడు ఢిల్లీ వ్యాప్తంగా 4108 ఆర్టీపీసీఆర్‌ టెస్టులు నిర్వహించగా.. 5187 ర్యాపిడ్‌ యాంటిజెన్‌ టెస్టులు నిర్వహించినట్లు ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటి వరకు ఢిల్లీ వ్యాప్తంగా 10,83,097 కరోనా టెస్టులు నిర్వహించినట్లు వెల్లడించింది.

 

Read More :

మహారాష్ట్రలో తగ్గిన కేసులు.. పెరిగిన రికవరీలు

కొత్త మ్యాప్ అంటూ మన ప్రదేశాలతో.. పాక్‌ కన్నింగ్ వేషాలు

Loading...
Unable to load recommendations.
Follow Us