షాకింగ్ ఘటన.. “కరోనా” అంటూ అమ్మాయిపై ఉమ్మేసి.. ఆ తర్వాత..

| Edited By:

Mar 23, 2020 | 7:30 PM

ప్రపంచ వ్యాప్తంగా కరోనా ప్రభావం అంతా ఇంతా లేదు. ఇప్పటికే పదిహేను వేల మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. మనదేశంలో కూడా దీని ప్రభావం ఎక్కువైంది. అయితే ఇప్పటికే సోషల్ డిస్టెన్స్ పాటించాలని ప్రభుత్వం చెప్తుంటే.. దేశరాజధాని ఢిల్లీలో షాకింగ్ సంఘటన చోటుచేసుకుంది. ఓ 25 ఏళ్ల వయస్సున్న మణిపూర్‌ కు చెందిన అమ్మాయి పట్ల ఓ వ్యక్తి దారుణంగా ప్రవర్తించాడు. కరోనా అంటూ అరుస్తూ అమెపై ఉమ్మేసి పారిపోయాడు. ఈ ఘటన ఆదివారం రాత్రి ముఖర్జీ […]

షాకింగ్ ఘటన.. కరోనా అంటూ అమ్మాయిపై ఉమ్మేసి.. ఆ తర్వాత..
Follow us on

ప్రపంచ వ్యాప్తంగా కరోనా ప్రభావం అంతా ఇంతా లేదు. ఇప్పటికే పదిహేను వేల మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. మనదేశంలో కూడా దీని ప్రభావం ఎక్కువైంది. అయితే ఇప్పటికే సోషల్ డిస్టెన్స్ పాటించాలని ప్రభుత్వం చెప్తుంటే.. దేశరాజధాని ఢిల్లీలో షాకింగ్ సంఘటన చోటుచేసుకుంది. ఓ 25 ఏళ్ల వయస్సున్న మణిపూర్‌ కు చెందిన అమ్మాయి పట్ల ఓ వ్యక్తి దారుణంగా ప్రవర్తించాడు. కరోనా అంటూ అరుస్తూ అమెపై ఉమ్మేసి పారిపోయాడు. ఈ ఘటన ఆదివారం రాత్రి ముఖర్జీ నగర్ ప్రాంతంలో చోటుచేసుకుంది. బాధిత యువతి ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిందితుడి కోసం గాలిస్తున్నట్లు పోలీస్ అధికారులు తెలిపారు. ఘటన జరిగిన ప్రాంతం నుంచి సీసీ ఫుటేజీ రికార్డుల సహాయంతో నిందితుడిని గుర్తిస్తున్నట్లు పేర్కొన్నారు.

కాగా. ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు.. సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ విచారం వ్యక్తం చేశారు. నిందితుడిని పట్టుకుని కఠినంగా శిక్షించాలని పోలీసులకు ఆదేశించారు. ఇప్పుడు మనమంతా ఒక దేశంగా ఐక్యత చాటుకోవాల్సిన అవసరం ఉందని.. ప్రత్యేకించి కోవిడ్-19పై పోరాడేందుకు ఇది చాలా
అవసరమంటూ ట్వీట్ చేశారు.

Am shocked to read this. Delhi Police must find the culprit and take strict action. We need to be united as a nation, especially in our fight against Covid-19 https://t.co/roMOMq2jNf

— Arvind Kejriwal (@ArvindKejriwal) March 23, 2020