‘పర్మనెంట్ లాక్ డౌన్ లో ఉండలేం’… అరవింద్ కేజ్రీవాల్

ఢిల్లీ శాశ్వతంగా లాక్ డౌన్ లో ఉండజాలదని సీఎం అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. కరోనా వైరస్ మరణాలను తగ్గించడానికి తమ ప్రభుత్వం అన్ని ప్రయత్నాలూ చేస్తోందన్నారు. ఈ క్రైసిస్ ని ఎదుర్కోవడానికి..

పర్మనెంట్ లాక్ డౌన్ లో ఉండలేం... అరవింద్ కేజ్రీవాల్

Edited By:

Updated on: May 30, 2020 | 7:54 PM

ఢిల్లీ శాశ్వతంగా లాక్ డౌన్ లో ఉండజాలదని సీఎం అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. కరోనా వైరస్ మరణాలను తగ్గించడానికి తమ ప్రభుత్వం అన్ని ప్రయత్నాలూ చేస్తోందన్నారు. ఈ క్రైసిస్ ని ఎదుర్కోవడానికి తమ ప్రభుత్వం సిధ్ధంగా ఉందని, వైరస్ కన్నా ‘ నాలుగు అడుగులు ముందే  ఉన్నామని’ ఆయన చెప్పారు. నగరంలో కరోనా కేసులు పెరుగుతున్న మాట వాస్తవమేనని, కానీ దీని గురించి తాము ఆందోళన చెందడంలేదని ఆయన అన్నారు. శాశ్వతంగా లాక్ డౌన్ లో ఎలా ఉంటామని ప్రశ్నించారు. 17 వేల కరోనా కేసుల్లో ఆస్పత్రుల్లో రెండు వేలమందికి పైగా రోగులు కోలుకున్నారు. వీరిలో చాలామంది ఇళ్లలోనే ఈ వ్యాధి నుంచి బయటపడ్డారు అని కేజ్రీవాల్ వివరించారు. హాస్పిటల్స్ లో పడకల లభ్యత గురించి ప్రజలకు సమాచారం అందించేందుకు తమ ప్రభుత్వం ఓ యాప్ ని డెవలప్ చేస్తున్నట్టు ఆయన తెలిపారు. పదిహేను రోజుల్లో నగరంలో ఎనిమిదిన్నర వేల కరోనా కేసులు కొత్తగా నమోదయ్యాయని, కానీ హాస్పిటల్స్ లో సుమారు ఐదువందలమంది చేరారని అయన చెప్పారు.