కరోనా కాటుకు బీజేపీ నేత మృతి

కరోనా మహమ్మారి కాటుకు బీజేపీ నేత మరణించారు. ఈ సంఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది.

కరోనా కాటుకు బీజేపీ నేత మృతి

Updated on: Jun 11, 2020 | 10:23 PM

కరోనా మహమ్మారి కాటుకు బీజేపీ నేత మరణించారు. ఈ సంఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. ఢిల్లీలోని బీజేపీ విభాగంలో ఓ కమిటీకి చైర్మన్‌గా బాధ్యతలు చేపడుతున్న సంజయ్‌ శర్మ.. గురువారం నాడు కరోనా బారినపడి మరణించారు. లాక్‌డౌన్ ఉన్న సమయంలో.. ఆయన అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారని.. పేదలకు సాయం చేయడంలో ముందున్నారు. అయితే ఈ క్రమంలో గత కొద్ది రోజుల క్రితం కరోన లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయించుకోగా.. పాజిటివ్ అని తేలింది. దీంతో ఆయన ఆస్పత్రిలో చేరి చికిత్స పోందుతున్నారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ గురువారం నాడు మరణించారు. సంజయ్ శర్మ మృతి పట్ల ఢిల్లీ బీజేపీ ప్రధాన కార్యదర్శి రాజేశ్ భాటియా సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని.. సంజయ్ శర్మ లేని బాధను.. తట్టుకునేలా ఆయన కుటుంబానికి శక్తిని కల్గించాలని భగవంతుడిని కోరుతున్నట్లు ట్విట్టర్‌లో తెలిపారు.

Loading...
Unable to load recommendations.
Follow Us