కేంద్ర రక్షణ శాఖ కార్యదర్శికి కరోనా పాజిటివ్..

తాజాగా భారత కేంద్ర రక్షణ శాఖ కార్యదర్శి అజయ్ కుమార్‌కు ఈ వైరస్ సోకింది. అజయ్ కుమార్‌కు కరోనా ప్రాథమిక లక్షణాలు కనిపిచటంతో వైద్య పరీక్షలు నిర్వహించారు. దీంతో ఆయనకు పాజిటివ్ అని‌ నిర్ధారణ అయ్యింది.....

కేంద్ర రక్షణ శాఖ కార్యదర్శికి కరోనా పాజిటివ్..

Updated on: Jun 04, 2020 | 7:43 AM

కరోనా వైరస్ ఎవరినీ వదలటం లేదు. ప్రధాని నుంచి మొదలు సామాన్యుడి వరకు మహమ్మారి పట్టిపీడిస్తోంది. తాజాగా భారత కేంద్ర రక్షణ శాఖ కార్యదర్శి అజయ్ కుమార్‌కు ఈ వైరస్ సోకింది. అజయ్ కుమార్‌కు కరోనా ప్రాథమిక లక్షణాలు కనిపిచటంతో వైద్య పరీక్షలు నిర్వహించారు. దీంతో ఆయనకు పాజిటివ్ అని‌ నిర్ధారణ అయ్యింది. వెంటనే ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ఆయన పనిచేస్తున్న రైజినా హిల్స్ లోని సౌత్ బ్లాకులో 35 మంది ఉద్యోగులను హోం క్వారంటైన్‌కు తరలించారు. రక్షణ శాఖ కార్యదర్శికే కరోనా సోకడంతో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ముందుజాగ్రత్తగా బుధవారం కార్యాలయానికి రాలేదు. సౌత్ బ్లాకులోని మొదటి అంతస్తులో కేంద్ర రక్షణశాఖ మంత్రి, రక్షణ శాఖ కార్యదర్శి, ఆర్మీచీఫ్, నేవీ చీఫ్ కార్యాలయాలు ఉన్నాయి. అయితే రక్షణ శాఖ కార్యదర్శి కార్యాలయాన్ని హాట్‌స్పాట్ కేంద్రంగా గుర్తించి, శానిటైజ్ చేయించారు.