వీకెండ్ గ్రాసరీ ధమాకాః ఒక్క రూపాయికే…నెయ్యి, గోధుమ పిండి, బాదం పప్పు..

కరోనా కాలంలో ఆన్‌లైన్ షాపింగ్ పెరగడంతో కస్టమర్లను ఆకట్టుకోవడానికి భారీ డిస్కౌంట్లను తీసుకు వచ్చింది. హోల్ సేల్ షాపుల కంటే అతి తక్కువ ధరలకు గోధుమ పిండి, నూనే, బాదం పప్పు ఇలా రకరకాల వస్తువులను అందిస్తోంది. దీంతో ఈ ఆఫర్ వినియోగదారులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

వీకెండ్ గ్రాసరీ ధమాకాః ఒక్క రూపాయికే...నెయ్యి, గోధుమ పిండి, బాదం పప్పు..

Updated on: Jun 13, 2020 | 3:15 PM

క‌రోనా కాలంలో ప్ర‌జ‌లు ఇళ్ల‌నుండి బ‌య‌ట‌కు రావాలంటేనే జంకుతున్నారు. బ‌య‌ట‌కు వెళితే, ఎక్క‌డా వైర‌స్ బారిన‌ప‌డ‌తామోన‌నే భ‌యంతో షాపింగ్ కూడా ఆన్‌లైన్‌లోనే చేసేస్తున్నారు. దీంతో ఆన్‌లైన్ షాపింగ్ విప‌రీతంగా పెరిగిపోయింది. దీంతో క‌స్ట‌మ‌ర్ల‌ను ఆక‌ట్టుకోవ‌డానికి ప‌లు సంస్థ‌లు కూడా భారీ డిస్కౌంట్ల‌ను అందుబాటులోకి తెస్తున్నాయి. హోల్ సేల్ షాపుల కంటే అతి తక్కువ ధరలకు గోధుమ పిండి, నూనే, బాదం పప్పు ఇలా రకరకాల వస్తువులను అందిస్తోంది. దీంతో ఈ ఆఫర్ వినియోగదారులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

వీకెండ్ గ్రాసరీ ధమాకా పేరుతో ఫ్లిప్‌కార్ట్‌లో భారీ తగ్గింపు లభిస్తోంది. దీనిలో వినియోగదారులు కేవలం 1 రూపాయికి కూడా షాపింగ్ చేయవచ్చు. 100 ఎంఎల్ దేశీ నెయ్యి ప్యాక్ ను 1 రూపాయికి ఇస్తున్నారు.  అదే సమయంలో, పిల్స్‌బరీ తాజా గోధుమ పిండిని కూడా 98% తగ్గింపుతో వినియోగదారులు కేవలం 1 రూపాయికి 1 కిలో పిండిని కొనుగోలు చేయవచ్చు. రాజధాని రాజ్మా, అలాగే హ్యాపిల్లో బ్రాండ్ 100 గ్రాముల బాదంపప్పును 1 రూపాయికే ఇవ్వ‌నున్నారు. వీటితో పాటు సుగంధ ద్రవ్యాలు, మసాలలపై 20 శాతం తగ్గింపు ఇచ్చింది. వీటితో పాటు ఆహార ధాన్యాలు, నూనెను 60% తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. దీంతో పాటు ఐసిఐసిఐ క్రెడిట్ లేదా డెబిట్ కార్డును వినియోగిస్తే మరో 10% తగ్గింపు పొందవచ్చు,హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ పేజాప్‌ ద్వారా 100 రూపాయల తగ్గింపు ఇస్తోంది.