
Cyberabad CP Sajjanar: కరోనావైరస్ బారినపడి కోలుకున్న వారు ప్లాస్మా దానం చేయాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి.సజ్జనార్ శనివారం కోరారు. “కరోనావైరస్ బారిన పడి అనేక మంది రోగులు ఉన్నారు, కొందరు పరిస్థితి విషమంగా ఉంది. కోలుకున్న వారిలో సుమారు 500 మి.లీ ప్లాస్మా ఇద్దరు కరోనావైరస్ రోగుల ప్రాణాలను రక్షించడంలో సహాయపడుతుంది” అని సజ్జనార్ చెప్పారు.
కరోనావైరస్ నుండి కోలుకున్న ముగ్గురు పోలీసులు రోగుల ప్రాణాలను కాపాడే ప్లాస్మాను దానం చేయడానికి ముందుకు వచ్చారని ఆయన అన్నారు. ప్లాస్మా దానం చేయాలనుకునే వారు 9490617440 నెంబర్ కు సమాచారం ఇవ్వాలని సీపీ తెలిపారు. కరోనావైరస్ నుండి పూర్తిగా కోలుకున్న వ్యక్తులు వారి ప్లాస్మాను దానం చేయడం ద్వారా సంక్రమణతో పోరాడుతున్న రోగులకు సహాయం చేయవచ్చు.
Also Read: విధులకు హాజరు కాకపోతే.. రిటైర్మెంటే గతి ..!