కరోనాతో సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ మృతి

దేశంలో కరోనా మహమ్మారి వికృత రూపం దాల్చుతోంది. రోజురోజుకూ వైరస్ బారినపడి మరణించిన వారి సంఖ్య రెట్టింపు స్థాయిలో నమోదవుతోంది. తాజాగా కోవిడ్-19 బారినపడి మరో సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ మృత్యువాతపడ్డారు.

కరోనాతో సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ మృతి

Updated on: Jun 08, 2020 | 10:18 PM

దేశంలో కరోనా మహమ్మారి వికృత రూపం దాల్చుతోంది. రోజురోజుకూ వైరస్ బారినపడి మరణించిన వారి సంఖ్య రెట్టింపు స్థాయిలో నమోదవుతోంది. సామాన్యులు మొదలు, వీఐపీలు, రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు ఇలా ఎవ్వరినీ వైరస్ వదలటం లేదు. చివరకు కరోనాపై నిరంతరం యుద్ధం చేస్తున్న డాక్టర్లు, పారిశ్రామిక సిబ్బంది, పోలీసులను సైతం పట్టిపీడిస్తున్న వైరస్ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతోంది. తాజాగా కోవిడ్-19 బారినపడి మరో సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ మృత్యువాతపడ్డారు. కానిస్టేబుల్‌కు పరీక్షల అనంతరం జూన్ 5వ తేదీన కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో అతడికి చికిత్స అందిస్తున్నారు. చికిత్స పొందుతూనే ఆదివారం రాత్రి ఆస్పత్రిలో మృతి చెందాడు.

Loading...
Unable to load recommendations.
Follow Us