Covid Vaccination: కోవిడ్ వ్యాక్సినేషన్‌కు సర్వం సిద్ధం.. తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాకు చేరిన వ్యాక్సిన్..

|

Jan 14, 2021 | 4:30 PM

Covid Vaccination: కరోనా మహమ్మారి అంతు చూసేందుకు అడుగు ముందుకు పడింది. తెలంగాణ వ్యాప్తంగా ఈనెల 16వ తేదీ నుంచి వ్యాక్సినేషన్ ప్రక్రియ..

Covid Vaccination: కోవిడ్ వ్యాక్సినేషన్‌కు సర్వం సిద్ధం.. తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాకు చేరిన వ్యాక్సిన్..
Follow us on

Covid Vaccination: కరోనా మహమ్మారి అంతు చూసేందుకు అడుగు ముందుకు పడింది. తెలంగాణ వ్యాప్తంగా ఈనెల 16వ తేదీ నుంచి వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈనేపథ్యంలో కొవాగ్జిన్, కొవిషీల్డ్ వ్యాక్సిన్లను రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు పంపిణీ చేశారు. తొలుత కోఠి ఇమ్యునైజేషన్ బిల్డింగ్‌లో వ్యాక్సిన్ డోసులను భద్రపరచగా.. అక్కడి నుంచి జిల్లాలకు పంపిణీ చేశారు. ఇప్పటి వరకు దాదాపు అన్ని జిల్లాలకు వ్యాక్సిన్ డోసులను అధికారులు పంపిణీ చేశారు. ఇక జనవరి 16వ తేదీన తొలి కొవిడ్‌ టీకాను గాంధీ ఆసుపత్రిలో గత 10 నెలలుగా విశేష సేవలందిస్తున్న ఒక పారిశుద్ధ్య కార్మికుడికి వేయనున్నారు. కాగా, ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రారంభించనున్నారు.

జిల్లాల వారీగా ఏ జిల్లాకు ఎన్ని వ్యాక్సిన్ డోసులు పంపించారనే వివరాలు తెలుసుకుందాం..
సంగారెడ్డి జిల్లాకు 78 వాయిల్స్.. 780 డోసులు..
హైదరాబాద్ (1)కు 1200 వాయిల్స్.. 12000 డోసులు..
హైదరాబాద్( 2) 1807 వాయిల్స్..18070 డోసులు..
సూర్యాపేట జిల్లాకు 47 వాయిల్స్.. 470 డోసులు..
వికారాబాద్ జిల్లా 46 వాయిల్స్.. 460 డోసులు..
సిద్దిపేట్ జిల్లా కు 179 వాయిల్స్.. 1790 డోసులు..
ఆదిలాబాద్ కి 237 వాయిల్స్.. 2370 డోసులు
నిర్మల్ జిల్లా కు 134 వాయిల్స్..1340 డోసులు..
మంచిర్యాల జిల్లా కు 46 వాయిల్స్.. 460 డోసులు..
పెద్దపల్లి జిల్లా కు 38 వాయిల్స్.. 380 డోసులు..
మేడ్చల్ జిల్లాకు 327 వాయిల్స్.. 3270 డోసులు..
నిజాంబాద్ జిల్లాకు 302 వాయిల్స్.. 3020 డోసులు..
కామారెడ్డి జిల్లా 80 వాయిల్స్.. 800 డోసులు..
కరీంనగర్ జిల్లాకు154 వాయిల్స్.. 1540 డోసులు.
రంగారెడ్డి జిల్లాకు 119 వాయిల్స్.. 1190 డోసులు..
జగిత్యాల జిల్లాకు 84 వాయిల్స్.. 840 డోసులు..
రాజన్న సిరిసిల్ల జిల్లాకు128 వాయిల్స్.. 1280 డోసులు..
మహబూబ్ నగర్ జిల్లాకు 173 వాయిల్స్.. 1730 డోసులు..
నాగర్ కర్నూలు జిల్లాకు 23 వాయిల్స్.. 230 డోసులు..
వనపర్తి జిల్లా కు 66 వాయిల్స్.. 660 డోసులు..
గద్వాల్ జిల్లా కు 88 వాయిల్స్.. 880 డోసులు..
వరంగల్ జిల్లా అర్బన్ కు 264 వాయిల్స్.. 2640 డోసులు..
వరంగల్ రూరల్ 58 వాయిల్స్.. 580 డోసులు..
ములుగు 50 వాయిల్స్.. 500 డోసులు..
భూపాలపల్లి 56 వాయిల్స్.. 560 డోసులు..
నారాయణ పేట.. 114 వాయిల్స్.. 1140 డోసులు..
జనగాం జిల్లా 83 వాయిల్స్.. 830 డోసులు..
మెహబూబబాద్ జిల్లా 172 వాయిల్స్..1720 డోసులు..
యాదాద్రి జిల్లా కు 116 వాయిల్స్..1160 డోసులు..
నల్గొండ జిల్లా కు 128 వాయిల్స్..1280 డోసులు..
మెదక్ జిల్లా కు 79 వాయిల్స్..790 డోసులు..
ఖమ్మం జిల్లాకు 153 వాయల్స్.. 1,530 డోసులు..

Also read:

Venkatesh’s ‘Narappa’ : కుటుంబ సభ్యులతో విహారయాత్రలో ఉల్లాసంగా ‘నారప్ప’.. ఆకట్టుకుంటున్న పోస్టర్..

Motorcyclist Fined: దిమ్మదిరిగే షాకిచ్చిన అధికారులు.. ద్విచక్ర వాహనదారుడికి రూ.1.13 లక్షల జరిమానా