షాకింగ్ న్యూస్.. వ్యాక్సిన్ వచ్చినా కరోనా పోదట..!

| Edited By:

May 29, 2020 | 8:29 AM

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనాను వ్యాక్సిన్‌ వస్తే అడ్డుకోవచ్చని అందరూ భావిస్తున్నారు. అయితే వ్యాక్సిన్‌ వచ్చినా కరోనా పోదని అమెరికాకు చెందిన ఎపిడమాలజిస్టులు అంటున్నారు.

షాకింగ్ న్యూస్.. వ్యాక్సిన్ వచ్చినా కరోనా పోదట..!
Follow us on

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనాను వ్యాక్సిన్‌ వస్తే అడ్డుకోవచ్చని అందరూ భావిస్తున్నారు. అయితే వ్యాక్సిన్‌ వచ్చినా కరోనా పోదని అమెరికాకు చెందిన ఎపిడమాలజిస్టులు అంటున్నారు. హెచ్‌ఐవీ, చికెన్‌ఫాక్స్‌(అమ్మవారు)లా కరోనా కూడా భవిష్యత్‌లో మన మధ్యనే ఉంటుందని వారు అంటున్నారు. అమెరికాలో నెక్ట్స్‌ ఫేజ్‌లో కరోనా మరింత తీవ్రతరం కానుందని వారు చెబుతున్నారు. జలుబు లక్షణానికి సంబంధించిన కరోనావైరస్‌లు ఇప్పుడు నాలుగు ఉన్నాయని, కోవిడ్ 19 ఐదోదని తాము భావిస్తున్నట్లు వెల్లడించారు.

దీనిపై షికాగో యూనివర్సిటీకి చెందిన ఎపిడమాలజిస్టు సారా కోబే మాట్లాడుతూ.. ”వ్యాక్సిన్ వచ్చినా కరోనా ఎక్కడికి పోదు. మన మధ్యనే ఉంటుంది. ప్రస్తుతమున్న ప్రశ్న ఒక్కటే. కరోనా ఉన్నా మనం జాగ్రత్తగా ఎలా బతకాలన్నది మాత్రమే” అన్నారు. కాగా కరోనాను ఎదుర్కొనేందుకు ప్రపంచదేశాలన్నీ ఒక తాటిపైనే నిలవాలని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచం ఇంతటి విపత్కర పరిస్థితి ఎదుర్కొంటున్న సమయంలో కొన్ని దేశాలు మాత్రం ఆర్థిక లోటును పూడ్చుకోవడం కోసం కార్యకలాపాలను ప్రారంభిస్తున్నాయని వారు అంటున్నారు.

Read This Story Also: అమానుష ఘటన.. కరోనా పోవాలని నరబలి..!