Omicron New Variant: ఒమిక్రాన్ ఉగ్రరూపం.. వెలుగు చూసిన మరో రెండు కొత్త వేరియంట్లు..!

|

Apr 14, 2022 | 5:14 AM

Omicron New Variant: ప్రపంచ వ్యాప్తంగా కరోనా ఉధృతితో పాటు కొత్త రూపాంతరాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఒమిక్రాంట్ వేరియంట్‌ వరుసగా రూపం మార్చుకుంటూ విరుచుకుపడుతోంది.

Omicron New Variant: ఒమిక్రాన్ ఉగ్రరూపం.. వెలుగు చూసిన మరో రెండు కొత్త వేరియంట్లు..!
Xe Omicron
Follow us on

Omicron New Variant: ప్రపంచ వ్యాప్తంగా కరోనా ఉధృతితో పాటు కొత్త రూపాంతరాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఒమిక్రాంట్ వేరియంట్‌ వరుసగా రూపం మార్చుకుంటూ విరుచుకుపడుతోంది. తాజాగా దక్షిణాఫ్రికాలో మరో రెండు ఒమిక్రాన్‌ వేరియంట్స్‌ బయట పడ్డాయి. వీటిని BA 4, BA 5 వేరియంట్స్‌గా గుర్తించారు పరిశోధకులు. అప్రమత్తమైన ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ వేరియంట్ల ప్రభావంపై అధ్యయనం చేస్తోంది. అయితే, దక్షిణాఫ్రికాలో ఈ BA 4, BA 5 కేసులు పెరుగుతున్నా, ఆస్పత్రుల్లో చేరికలు, మరణాలు పెద్దగా లేకపోవడం ఊరటనిస్తోంది.

BA 4, BA 5 వేరింయంట్‌ కేసులను ఇప్పటికే బ్రిటన్‌, బోట్స్‌వానా, బెల్జియం, జర్మనీ, డెన్మార్క్‌ దేశాల్లో కూడా గుర్తించారు. BA 2 మాదిరిగానే BA 4, BA 5 వేరియంట్స్‌ స్పైక్‌ ప్రొఫైల్‌ను కలిగి ఉన్నాయని చెబుతున్నారు. వీటిలోని ఒక స్పైక్‌ ప్రొటీన్‌ డెల్టా, కప్పా, ఎప్సిలాన్‌ వేరియంట్లలో ఉన్నదేనని శాస్త్రవేత్తలు అంటున్నారు. కొత్త వేరియంట్‌ సోకినవారు ఇప్పటికే వ్యాక్సిన్స్‌ తీసుకున్నందున వారిలో లక్షణాలు తక్కువగానే ఉన్నాయని తెలిపారు.

మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా కరోనా సంక్షోభం మొదలైప్పటి నుంచి ఇప్పటి వరకూ నమోదైన కేసుల సంఖ్య 50 కోట్లు దాటిపోయింది. అమెరికాలో కరోనా మరణాల సంఖ్య 10 లక్షలు దాటి మరో రికార్డు నమోదైంది. భారత్‌లో కొత్తగా బయటపడిన ‘ఎక్స్‌ఈ’ వేరియంట్‌పై కేంద్ర ఆరోగ్య శాఖ ఇప్పటికే అప్రమత్తమైంది. ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. వ్యాక్సినేషన్‌ మరింత వేగవంతం చేయాలని సూచించారు.

Also read:

Dawood Ibrahim: దావూద్‌కు సోదరుడికి ఝలక్.. పలు ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ..

Viral Video: ప్రతి కుక్కకు ఓ రోజు వస్తుందంటే ఇదేనేమో!.. వారు వెళ్లడమే ఆలస్యం.. రచ్చ రచ్చ చేసేశాయ్..!

Viral Video: గుడ్లను కాపాడేందుకు తల్లి పక్షి అద్భుత పోరాటం.. గుండెలు పిండేస్తున్న షాకింగ్ వీడియో..!