Covid 19: మరో పాజిటివ్ కేసు.. పేటీఎం ఉద్యోగికి కరోనా.. ఆఫీస్ క్లోజ్..!

| Edited By:

Mar 05, 2020 | 8:33 AM

భారతదేశంలో కరోనా వైరస్ బాధితుల సంఖ్య పెరుగుతోంది. నిన్నటికి నిన్న బాధితుల సంఖ్య 28మంది ఉండగా.. ఇవాళ మరో పేటీఎం ఉద్యోగికి కరోనా పాజిటివ్‌గా తేలింది. గురుగాన్‌లోని పేటీఎం సంస్థలో ఆ ఉద్యోగి పనిచేస్తున్నారు. తమ ఉద్యోగికి కరోనా వైరస్‌ సోకినట్టు ఆ సంస్థ ఓ ప్రకటనలో వెల్లడించింది.

Covid 19: మరో పాజిటివ్ కేసు.. పేటీఎం ఉద్యోగికి కరోనా.. ఆఫీస్ క్లోజ్..!
Follow us on

భారతదేశంలో కరోనా వైరస్ బాధితుల సంఖ్య పెరుగుతోంది. నిన్నటికి నిన్న బాధితుల సంఖ్య 28మంది ఉండగా.. ఇవాళ మరో పేటీఎం ఉద్యోగికి కరోనా పాజిటివ్‌గా తేలింది. గురుగాన్‌లోని పేటీఎం సంస్థలో ఆ ఉద్యోగి పనిచేస్తున్నారు. తమ ఉద్యోగికి కరోనా వైరస్‌ సోకినట్టు ఆ సంస్థ ఓ ప్రకటనలో వెల్లడించింది.

సదరు ఉద్యోగి ఇటీవలే ఇటలీ పర్యటనకు వెళ్లి తిరిగొచ్చారని.. అతడికి వైరస్‌ సోకినందుకు గుర్‌గాన్‌లోని పేటీఎం కార్యాలయాన్ని రెండు రోజుల పాటు మూసివేస్తున్నట్లు సంస్థ వెల్లడించింది. ఉద్యోగులందరూ అప్రమత్తంగా ఉండాలని.. జ్వరం లాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలని ఈ సందర్భంగా ఆ సంస్థ సూచించింది. గురుగాన్‌ యూనిట్‌ను శుభ్రపరిచే వరకు ఉద్యోగులు ఇంటి నుంచే పని చేయాలని ఆదేశించింది. తమ రోజువారి కార్యాకలాపాలపై ఎలాంటి ప్రభావం చూపబోదని.. పేటీఎమ్‌ ప్రతినిధి ఒకరు తెలిపారు.

కరోనా వైరస్ బారిన పడిన ఉద్యోగి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉంది. అతడికి అవసరమైన చికిత్స అందుతోంది. అతడి కుటుంబానికి మేము అండగా ఉంటాం అని పేటీఎం ప్రతినిధి పేర్కొన్నారు. కాగా కరోనా వైరస్ బారినపడి ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 3,285 మంది మృతి చెందారు. మొత్తం 95,177 కోవిడ్-19 కేసులు నమోదు కాగా.. 53,225మంది ఈ మహమ్మారిని జయించారు.