తమిళనాడులో కరోనా వైరస్ విలయ తాండవం సృష్టిస్తోన్న విషయం తెలిసిందే. అందులోనూ తమిళనాడు రాజధాని చెన్నైలో కోవిడ్ మరింత భయంకరంగా వ్యాప్తి చెందుతుంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో తమిళనాడు ప్రభుత్వం లాక్‌డౌన్ విధించింది. తాజాగా ఈ కరోనా ఎఫెక్ట్‌తో చెన్నైలోని ఓ ప్రైవేటు హాస్పిటల్ మూసివేయాల్సి వచ్చింది. ఆ ఆసుపత్రిలో ఏకంగా 50 మందికి పైగా హాస్పిటల్ సిబ్బందికి కరోనా పాజిటివ్ నిర్థారణ అయింది. తాజాగా ఈ కరోనాతో హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ శరత్ రెడ్డి మృతి చెందారు. దీంతో హాస్పిటల్ ఎమర్జెన్సీ సర్వీసులు నిలిపివేసింది. హాస్పిటల్లో ఉన్న ఇన్ పేషేంట్‌లను ఇతర హాస్పిటల్స్‌కు తరలిస్తున్నారు సిబ్బంది. అలాగే హాస్పిటల్‌లో సిబ్బందికి, వచ్చిన రోగులకు కరోనా టెస్టులు నిర్వహిస్తున్నారు. కాగా నెల్లూరు, చిత్తూరు జిల్లాల నుంచి తరచూ వైద్యం కోసం విజయ హాస్పిటల్‌కు వెళుతున్న వారిలో ఆందోళన నెలకొంది.
కాగా తమిళనాడు రాష్ట్రం కరోనా పాజిటివ్ కేసుల విషయంలో దేశవ్యాప్తంగా రెండో స్థానంలో ఉంది. ప్రస్తుతం తమిళనాడులో 1,07,001 కేసులు నమోదవ్వగా, 1450 మంది మరణించారు. ఇక 44,959 యాక్టీవ్ కేసులు ఉండగా, 60,592 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇక అలాగే దేశంలో 6,73,165 కరోనా కేసుల సంఖ్య నమోదవ్వగా.. కరోనాతో మరణించినవారి సంఖ్య 19,268కు చేరింది. ఇక ప్రస్తుతం యాక్టీవ్ కేసులు 2,44,814 ఉండగా, వ్యాధి నుంచి కోలుకున్నవారు 4,09,082 మంది.
Read More: