శ్రామిక్‌ రైళ్లలో 80 మంది వలస కూలీలు మృతి

|

May 30, 2020 | 1:59 PM

మే 9 నుంచి 27 వరకు శ్రామిక్ రైళ్లలో ప్రయాణించిన వలస కార్మికుల్లో 80 మంది మరణించినట్టు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) సమీక్షలో వెల్లడైనట్లు అధికారులు తెలిపారు. శ్రామిక్ స్పెషల్ రైళ్లలో ప్రయాణీకులు ఎదుర్కొంటున్న ప్రాథమిక సమస్యలలో వేడి, అలసట, దాహం ...

శ్రామిక్‌ రైళ్లలో 80 మంది వలస కూలీలు మృతి
Follow us on

కరోనా, లాక్‌డౌన్ కారణంగా వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వలస కూలీలను సొంత రాష్ట్రాలకు తరలించేందుకు ఇండియన్ రైల్వే శ్రామిక్ స్పెషల్ రైళ్లను కేంద్రం నడుపుతున్న విషయం తెలిసిందే. కాగా, మే 9 నుంచి 27 వరకు శ్రామిక్ రైళ్లలో ప్రయాణించిన వలస కార్మికుల్లో 80 మంది మరణించినట్టు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) సమీక్షలో వెల్లడైనట్లు అధికారులు తెలిపారు. ఆకలి, వేడి, దీర్ఘకాలిక వ్యాధుల కారణంగా వీరంతా మరణించినట్టు ఆర్పీఎఫ్ వివరించింది. మే 1 నుంచి 27 వరకు రైల్వే 3,840 శ్రామిక్ స్పెషల్ రైళ్లను నడిపి, 50 లక్షల మంది వలస కార్మికులను వారి సొంత రాష్ట్రాలకు చేర్చిందని పేర్కొంది.

అయితే, “శ్రామిక్ స్పెషల్ రైళ్లలో  ప్రయాణీకులు ఎదుర్కొంటున్న ప్రాథమిక సమస్యలలో వేడి, అలసట, దాహం ఎక్కువగా ఉన్నాయని ఆర్పీఎఫ్ వెల్లడించింది. రైళ్లలో ప్రయాణించే వలస కార్మికుల్లో ఎవరైనా అనారోగ్యానికి గురైతే రైలును ఆపి సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నట్టు రైల్వే బోర్డు చైర్మన్ వీకే యాదవ్ వివరణ ఇచ్చారు. అనారోగ్యానికి గురైన వారిని ఆస్పత్రికి తరలించటంతో పాటు…పలువురు గర్బిణిలకు రైల్వే ఆస్పత్రుల్లో ప్రసవాలు కూడా జరుగుతున్నాయని తెలిపారు.

అయితే, రైళ్లలో ఆహారం దొరక్క మాత్రం ఎవరూ చనిపోలేదని చెప్పారు. వలస కార్మికులను వారి స్వస్థలాలకు తరలించడానికి దేశవ్యాప్తంగా శ్రామిక్ స్పెషల్ ట్రైన్‌లను నడుపుతున్నామని.. ఈ సేవలను పొందుతున్న కొందరికి ముందు నుంచి అనారోగ్య సమస్యలు ఉండటం.. ఇది కోవిడ్ -19 మహమ్మారి సమయంలో వారు ఎదుర్కొనే ప్రమాదాన్నిపెంచుతుందన్నారు. అటువంటి వారు ప్రయాణ సమయంలో దురదృష్టవశాత్తు కొందరు ప్రాణాలు కోల్పోయారని రైల్వే శాఖ వెల్లడించింది. కాగా, శ్రామిక్ రైళ్లలో మరణించినవారి ప్రాథమిక జాబితా రూపొందించామని, రాష్ట్రాల సమన్వయంతో తుది జాబితా త్వరలోనే వెల్లడిస్తామని అధికారులు తెలిపారు.