ఏపీకి మరో టెన్షన్.. కొత్తగా 48 కరోనా కేసులు.. ఒకరి మృతి

|

May 26, 2020 | 11:46 AM

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 48 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా,  ఒకరు మ‌ృతి చెందారు. ఇదిలా ఉంటే,  ఇప్పుడు ఏపీని మరో టెన్షన్ వెంటాడుతోంది. రాష్ట్రంలోకి కొత్తగా వచ్చిన..

ఏపీకి మరో టెన్షన్.. కొత్తగా 48 కరోనా కేసులు.. ఒకరి మృతి
Follow us on

ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 8,148 శాంపిల్స్‌ను పరీక్షించగా 48 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవగా, ఒకరు మృతిచెందారు. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 2719కి చేరింది. కోవిడ్ బారిన పడి ఇప్పటివరకు మొత్తం 57 మంది మరణించారు. మొత్తంగా ఇప్పటివరకు నమోదైన కేసుల్లో 759 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండగా, 1903 మంది బాధితులు కోలుకున్నారు. ఈ రోజు కొత్తగా నమోదైనవాటిలో నాలుగు కేసులకు తమిళనాడులోని కోయంబేడుతో లింకులు ఉండగా, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వ్యక్తి కరోనాతో చనిపోయాడు. గత 24 గంటల్లో 55 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు.

రాష్ట్రంలో అత్యధికంగా కర్నూలు జిల్లాలో 650కి పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తర్వాత స్థానంలో గుంటూరు జిల్లాలో 400కు పైగా వైరస్ పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. రాష్ట్రవ్యాప్తంగా కరోనాతో మొత్తం 57మంది చనిపోయారు. గత 24 గంటల్లో కోవిడ్ వల్ల ఒకరు కన్నుమూశారు. తాజాగా నమోదవుతున్న కరోనా కేసుల్లో చిత్తూరు, నెల్లూరు జిల్లాలతో పాటూ మరికొన్ని జిల్లాల్లో నమోదవుతున్న కేసుల్లో ఎక్కువ కోయంబేడు మార్కెట్ లింకులు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే కోయంబేడు లింకులతో పాటూ విదేశాల నుంచి వచ్చిన వారితో కొత్త టెన్షన్ ఏపీని వెంటాడుతోంది. విదేశాల నుంచి వచ్చిన వారిలో కూడా కొన్ని కేసులు ఉన్నాయి. విదేశాల నుంచి వచ్చిన 111మందికి వైరస్ సోకినట్లు అధికారులు వెల్లడించారు.