AP Corona: ఏపీలో మరోసారి కోరలు చాస్తున్న కరోనా మహమ్మారి.. నిత్యం వెయ్యికిపైగా కొత్త కేసులు.. నిన్న 14 మంది వైరస్‌తో మృతి!

|

Sep 16, 2021 | 5:25 PM

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి మెల్లగా విరుచుకుపడుతోంది. నిన్నటి పోల్చితే కాస్త ఎక్కువ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్ర వ్యాప్తంగా 61,178 కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 1,367 కొత్త కేసులు నమోదయ్యాయి.

AP Corona: ఏపీలో మరోసారి కోరలు చాస్తున్న కరోనా మహమ్మారి.. నిత్యం వెయ్యికిపైగా కొత్త కేసులు.. నిన్న 14 మంది వైరస్‌తో మృతి!
Corona
Follow us on

Andhra Pradesh Coronavirus Cases: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి మెల్లగా విరుచుకుపడుతోంది. నిన్నటి పోల్చితే కాస్త ఎక్కువ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్ర వ్యాప్తంగా 61,178 కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 1,367 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 20,34,786 మంది వైరస్‌ బారినపడినట్లు ఏపీ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొవిడ్‌ వల్ల 14 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయవడంతో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 14,044కి చేరింది.

ఇక, ఒక్కరోజు వ్యవధిలో 1,248 మంది బాధితులు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 20,06,034 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 14,708 యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2,75,36,639 నమూనాలను పరీక్షించినట్లు ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ గురువారం సాయంత్రం విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.

రాష్ట్రంలో జిల్లాల వారీగా నమోదైన కోవిడ్ కేసుల వివరాలు ఇలా ఉన్నాయి.

Ap Covid 19 Cases

Read Also…  Research: అలాంటి వ్యక్తి మీకు తోడుగా ఉంటే మీ మెదడు ఆరోగ్యం భేష్‌ అంటా.! ఈ విషయాన్ని చెబుతోంది మరెవరో కాదు..