జనవరి నుంచి అమెరికాలో కోవిడ్ వ్యాక్సీన్ !

అమెరికాలో వచ్ఛే జనవరి నుంచి కరోనా వైరస్ వ్యాక్సీన్ అందుబాటులోకి వస్తుందని అధ్యక్షుడు ట్రంప్ వ్యక్తిగత అధికారి, డాక్టర్ కూడా అయిన రాబర్ట్ కాడ్ లేక్ ప్రకటించారు. సురక్షితమైన, సమర్థవంతమైన టీకా మందు డిసెంబరులోగా ఆమోదం పొందవచ్చునని ఆశిస్తున్నట్టు ఆయన చెప్పారు. అయితే పంపిణీకి కొంత సమయం పడుతుందన్నారు. జనవరి లేదా ఫిబ్రవరి మొదటివారానికి ఈ టీకా మందు మార్కెట్ లో ఉండే అవకాశాలు చాలా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఎమర్జెన్సీ ఆధరైజేషన్ కి కొంత సమయం […]

జనవరి నుంచి అమెరికాలో కోవిడ్ వ్యాక్సీన్ !

Edited By:

Updated on: Oct 11, 2020 | 2:48 PM

అమెరికాలో వచ్ఛే జనవరి నుంచి కరోనా వైరస్ వ్యాక్సీన్ అందుబాటులోకి వస్తుందని అధ్యక్షుడు ట్రంప్ వ్యక్తిగత అధికారి, డాక్టర్ కూడా అయిన రాబర్ట్ కాడ్ లేక్ ప్రకటించారు. సురక్షితమైన, సమర్థవంతమైన టీకా మందు డిసెంబరులోగా ఆమోదం పొందవచ్చునని ఆశిస్తున్నట్టు ఆయన చెప్పారు. అయితే పంపిణీకి కొంత సమయం పడుతుందన్నారు. జనవరి లేదా ఫిబ్రవరి మొదటివారానికి ఈ టీకా మందు మార్కెట్ లో ఉండే అవకాశాలు చాలా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఎమర్జెన్సీ ఆధరైజేషన్ కి కొంత సమయం పడుతుందన్నారు. అయితే ట్రంప్ మాత్రం ఈ నెల నుంచే వ్యాక్సీన్ అందుబాటులో ఉంటుందని ప్రకటించడం విశేషం.