ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. రాష్ట్రంలో ఇవాళ 56 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 1,833కు చేరింది. వీరిలో 38 మంది మృతి చెందగా.. 780 మంది డిశ్చార్జ్ అయ్యారు. 1,051 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. తాజా లెక్కల ప్రకారం.. అనంతపురంలో 83, చిత్తూరులో 82, తూర్పు గోదావరి జిల్లాలో 46, గుంటూరులో 37, కడపలో 96, కృష్ణా జిల్లాలో 316, కర్నూల్‌లో 540, నెల్లూరులో 96, ప్రకాశంలో 61, శ్రీకాకుళంలో 5, విశాఖలో 46, విజయనగరంలో 3, పశ్చిమ గోదావరిలో 59 కేసులు నమోదయ్యాయి. ఇక మొన్నటివరకు గ్రీన్ జిల్లాగా ఉన్న విజయనగరంలో మూడు పాజిటివ్ కేసులు రావడం ఆందోళన కలిగిస్తోంది. జిల్లాలో అరవై సంవత్సరాల వృద్దురాలితో పాటు మరో ఇద్దరు మహిళలకు కరోనా పాజిటివ్బా సోకింది. బాధితుల్లో ఇద్దరు వలస కూలీలు ఉన్నారు. గత నాలుగురోజుల క్రితం కృష్ణ జిల్లా నుంచి వీరు వచ్చారు. ఈ క్రమంలో బాధితుల కుటుంబసభ్యులను, వారితో ప్రయాణించిన వారిని క్వారంటైన్ కు తరలించారు. యాభై బృందాలను ఏర్పాటుచేసి మరింత లోతుగా అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
Read This Story Also: మద్యం మత్తులో పామును కొరికిన వ్యక్తి అరెస్ట్..!