India Corona: హమ్మయ్య.. దేశవ్యాప్తంగా దిగివస్తున్న కరోనా మహమ్మారి.. నెల తర్వాత, వరుసగా రెండవ రోజు లక్షకు దిగువన కేసులు!

దేశంలో కరోనా తగ్గుముఖం పట్టినట్లు కనిపిస్తోంది. దాదాపు ఒక నెల తర్వాత, వరుసగా రెండవ రోజు, లక్ష కంటే తక్కువగా కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి.

India Corona: హమ్మయ్య.. దేశవ్యాప్తంగా దిగివస్తున్న కరోనా మహమ్మారి.. నెల తర్వాత, వరుసగా రెండవ రోజు లక్షకు దిగువన కేసులు!

Updated on: Feb 08, 2022 | 11:14 AM

India Coronavirus update today:  దేశంలో కరోనా తగ్గుముఖం పట్టినట్లు కనిపిస్తోంది. దాదాపు ఒక నెల తర్వాత, వరుసగా రెండవ రోజు, లక్ష కంటే తక్కువగా కొత్త కొవిడ్(Covid 19) కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 67,597 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా , 1188 మంది సోకిన మహమ్మారి బారినపడి ప్రాణాలు కోల్పోయారు(Corona deaths). అయితే, దీనికి ఒక రోజు ముందు నిన్న (సోమవారం), 83 వేల 876 కొత్త కరోనా కేసులు వచ్చాయి. 896 మంది ప్రాణాలు కోల్పోయారు. ఉపశమనం ఏమంటే, గత 24 గంటల్లో, ఒక లక్షా 80 వేల 456 మంది కరోనా నుండి కోలుకున్నారు. కాగా, ప్రస్తుతం ఒక లక్షా 14 వేల యాక్టివ్ కేసులు(Active cases) ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.

కరోనా మహమ్మారి ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటివరకు మొత్తం నాలుగు కోట్ల 23 లక్షల 39 వేల 611 మందికి వ్యాధి సోకింది. వీరిలో 5 లక్షల 4 వేల 62 మంది మరణించారు. ఇప్పటివరకు 4 కోట్ల 8 లక్షల 40 వేల మంది కూడా కోలుకున్నారు. దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 10 లక్షల కంటే తక్కువ. మొత్తం 9 లక్షల 94 వేల 891 మంది ఇంకా కరోనా వైరస్ బారిన పడి చికిత్స పొందుతున్నారు.


దేశంలో కరోనా మరణాల రేటు 1.19 శాతం కాగా, రికవరీ రేటు 96.19 శాతం. యాక్టివ్ కేసులు 2.62 శాతం. కరోనా యాక్టివ్ కేసుల విషయంలో భారత్ ఇప్పుడు ప్రపంచంలో 11వ స్థానంలో ఉంది. మొత్తం సోకిన వారి సంఖ్యాపరంగా భారతదేశం రెండవ స్థానంలో ఉంది. కాగా, అమెరికా, బ్రెజిల్ తర్వాత భారత్‌లో అత్యధిక మరణాలు నమోదయ్యాయి. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) ప్రకారం, భారతదేశంలో నిన్న 13,46,534 కరోనా వైరస్ నమూనా పరీక్షలు జరిగాయి. నిన్నటి వరకు మొత్తం 74,29,08,121 నమూనాలను పరీక్షించారు. గత 24 గంటల్లో 55 లక్షలకు పైగా కరోనా డోస్‌లు ఇవ్వడం జరిగిందని కేంద్రం తెలిపింది. దేశంలో ఇప్పటివరకు 170 కోట్లకు పైగా కరోనా వ్యాక్సిన్‌లు అందించబడం జరిగింది కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది.

Read Also….  Uttarakhand Elections: అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల్లో కుబేరులకు కొదవేలేదు.. ఏయే పార్టీల్లో ఎంతమంది ఉన్నారో తెలుసా..?