Corona Tests AP Record: కరోనా పరీక్షల నిర్వహణలో ఏపీ.. అన్ని రాష్ట్రాల కంటే ముందంజలో ఉంది. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 30 లక్షలకు పైగా టెస్టులు నిర్వహించి రికార్డు సృష్టించింది. ఒక మిలియన్ జనాభాకు 56,541 టెస్టులతో.. రాష్ట్ర జనాభాలో 5.65 శాతం మందికి కరోనా పరీక్షలు చేసింది. ఇక రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 30,19,296 టెస్టులు జరిగినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కాగా, రికవరీ రేటు విషయంలో కూడా ఏపీ గణాంకాలు భేష్‌గా ఉన్నాయని చెప్పాలి.
AP is the only state among all the major states to have tested 5.65% of the total population for #COVID19. With 56,541 tests/million AP continues to stay top in testing among all the states. #APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/TLHwbK27F4
— ArogyaAndhra (@ArogyaAndhra) August 19, 2020
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,16,003కు చేరింది. ఇందులో 86,725 యాక్టివ్ కేసులు ఉండగా.. 2,26,372 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అలాగే రాష్ట్రంలో మృతుల సంఖ్య 2906కు చేరింది. అటు గడిచిన 24 గంటల్లో 8061 మంది కరోనాను జయించారు.
Also Read:
డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్.. ‘వైఎస్సార్ ఆసరా’కు కేబినెట్ ఆమోదం..
మురుగునీటిలో కరోనా వైరస్.. తేల్చేసిన పరిశోధకులు..
డిలేట్ చేసిన వాట్సాప్ వీడియోలు, ఇమేజ్స్‌ను రికవర్ చేయండిలా..