షాకింగ్: కరోనా మరణాలు.. అంత్యక్రియలపైనా ఆంక్షలు..

Coronavirus Outbreak: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విలయ తాండవం చేస్తోంది. ఈ వైరస్ దెబ్బకు అనేక దేశాలు విధిస్తున్న ఆంక్షలు రోజురోజుకూ కఠినతరంగా మారుతున్నాయి. ఇప్పటికే అనేక మంది ఈ కోవిడ్ 19 బారిన పడి మృతి చెందారు. ఇక అమెరికా, స్పెయిన్, ఇటలీ దేశాలు అయితే కరోనాకు గడగడలాడుతున్నాయి. ఇదిలా ఉంటే ఈ మూడు దేశాల్లోనూ పాజిటివ్ కేసుల సంఖ్యతో పాటు మరణాలు కూడా పెరుగుతూ వస్తుండటంతో పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. ఇక కరోనా మహమ్మారి […]

షాకింగ్: కరోనా మరణాలు.. అంత్యక్రియలపైనా ఆంక్షలు..

Updated on: Mar 31, 2020 | 10:49 PM

Coronavirus Outbreak: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విలయ తాండవం చేస్తోంది. ఈ వైరస్ దెబ్బకు అనేక దేశాలు విధిస్తున్న ఆంక్షలు రోజురోజుకూ కఠినతరంగా మారుతున్నాయి. ఇప్పటికే అనేక మంది ఈ కోవిడ్ 19 బారిన పడి మృతి చెందారు. ఇక అమెరికా, స్పెయిన్, ఇటలీ దేశాలు అయితే కరోనాకు గడగడలాడుతున్నాయి. ఇదిలా ఉంటే ఈ మూడు దేశాల్లోనూ పాజిటివ్ కేసుల సంఖ్యతో పాటు మరణాలు కూడా పెరుగుతూ వస్తుండటంతో పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి.

ఇక కరోనా మహమ్మారి స్పెయిన్ దేశాన్ని అతలాకుతలం చేస్తోంది. అక్కడి ప్రభుత్వం అంత్యక్రియలు సంప్రదాయబద్దంగా చేయడాన్ని పూర్తిగా నిషేదించింది. చనిపోయిన వారి కుటుంబసభ్యులతో పాటు ఇద్దరు లేదా ముగ్గురు కంటే ఎక్కువ మంది హాజరు కావద్దని ఆదేశించింది. ప్రజలు అంత్యక్రియలకు సామూహికంగా వెళ్లకూడదని వెల్లడించింది. ఈ దేశంలో ఏప్రిల్ 11 వరకు లాక్ డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే.

కాగా, ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 8 లక్షలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అందులో లక్షా 72 వేల మంది కోలుకోగా.. 39 వేల మంది ఈ వైరస్ బారిన పడి ప్రాణాలు విడిచారు. అటు అమెరికా, ఇటలీ, స్పెయిన్ దేశాల్లో అత్యధిక కేసులు నమోదు కాగా.. ఇటలీలో అత్యధికంగా 11,591 మంది మరణించారు.

ఇవి చదవండి:

మద్యం ప్రియులకు శుభవార్త.. మూడు నెలలు బీర్లు ఫ్రీ.. ఫ్రీ..

EMIలపై కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పిన పలు బ్యాంకులు..

తెలంగాణ లాక్ డౌన్.. ఏప్రిల్ 14 వరకు మద్యం దుకాణాలు బంద్..