తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం.. ఉచితంగా మాస్కులు పంపిణీ..

|

Apr 12, 2020 | 9:14 AM

కరోనా ఫ్రీ తెలంగాణను చేసేందుకు కేసిఆర్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజలకు మాస్కులను ఉచితంగా పంపిణీ చేయాలనీ నిర్ణయించింది. కోవిడ్ 19ను కట్టడి చేసే క్రమంలో రాష్ట్ర ప్రజలందరూ తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలని సూచించింది. ఇళ్లలో ఉండేవారు కూడా వీటిని వినియోగించుకునేలా చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే మాస్కుల తయారీ, కొనుగోలు, పంపిణీ బాధ్యతలను స్థానిక సంస్థలకు అప్పజెప్పింది. స్థానికంగా ఉన్న మహిళా సంఘాలతో మాస్కులు తయారు చేయించి.. ఒక్కో మాస్క్‌కు రూ. 15 […]

తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం.. ఉచితంగా మాస్కులు పంపిణీ..
Follow us on

కరోనా ఫ్రీ తెలంగాణను చేసేందుకు కేసిఆర్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజలకు మాస్కులను ఉచితంగా పంపిణీ చేయాలనీ నిర్ణయించింది. కోవిడ్ 19ను కట్టడి చేసే క్రమంలో రాష్ట్ర ప్రజలందరూ తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలని సూచించింది. ఇళ్లలో ఉండేవారు కూడా వీటిని వినియోగించుకునేలా చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే మాస్కుల తయారీ, కొనుగోలు, పంపిణీ బాధ్యతలను స్థానిక సంస్థలకు అప్పజెప్పింది.

స్థానికంగా ఉన్న మహిళా సంఘాలతో మాస్కులు తయారు చేయించి.. ఒక్కో మాస్క్‌కు రూ. 15 చెల్లించి పంచాయతీలు, మున్సిపాలిటీలు వీటిని కొనుగోలు చేయనున్నాయి. ఇలా మొత్తంగా 3 కోట్లపైగా మాస్కులను తయారు చేయించి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ ఉచితంగా అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక వీటి ధర రూ. 50 కోట్లుగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.

ఇది చదవండి: అమెరికాలో కరోనా ఉగ్రరూపం.. 40 మంది భారతీయులు మృతి..