లాక్ డౌన్ పొడిగిస్తే.. ఇలా చేయండి.. ఓవైసీ ట్వీట్ వైరల్..

లాక్ డౌన్ పొడిగిస్తే.. ఇలా చేయండి.. ఓవైసీ ట్వీట్ వైరల్..

Coronavirus Outbreak: కరోనా ప్రభావాన్ని నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం విధించిన 21 రోజుల లాక్ డౌన్ ఈ నెల 14తో ముగియనుంది. ఇక దీన్ని పొడిగిస్తారా..? లేదా? అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే ప్రధాని మోదీ మరికొన్ని రోజులు లాక్ డౌన్‌ను పొడిగించాలని అనుకుంటున్నారని కూడా సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపధ్యంలో మజ్లీస్ అధినేత లాక్ డౌన్ సంబంధించి ఓ ట్వీట్ చేశారు. లాక్ డౌన్‌ను పొడిగించాలని అనుకుంటే కేంద్రం ముందుగా […]

Ravi Kiran

|

Apr 12, 2020 | 7:37 AM

Coronavirus Outbreak: కరోనా ప్రభావాన్ని నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం విధించిన 21 రోజుల లాక్ డౌన్ ఈ నెల 14తో ముగియనుంది. ఇక దీన్ని పొడిగిస్తారా..? లేదా? అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే ప్రధాని మోదీ మరికొన్ని రోజులు లాక్ డౌన్‌ను పొడిగించాలని అనుకుంటున్నారని కూడా సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపధ్యంలో మజ్లీస్ అధినేత లాక్ డౌన్ సంబంధించి ఓ ట్వీట్ చేశారు.

లాక్ డౌన్‌ను పొడిగించాలని అనుకుంటే కేంద్రం ముందుగా ఈ చర్యలు తీసుకోవాలని సూచించారు. ‘ప్రతీ కార్మికుడికి రూ. 5 వేలు, అన్నార్ధులకు సరిపడా ఆహార పదార్ధాలు, వలస కూలీలు, నిరుపేదలను ఆదుకునేందుకు అన్ని రాష్ట్రాలకు తగినన్ని నిధులు ఇవ్వాలన్నారు. ఇక అసదుద్దీన్ ఓవైసీ చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా, ముస్లింలందరూ కూడా సామూహిక ప్రార్థనలు అలాగే మసీదుకు వెళ్ళకూడదని.. లాక్ డౌన్ నిబంధనలను దృష్టిలో ఉంచుకోవాలని అసదుద్దీన్ ఓవైసీ విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే.

ఇది చదవండి: దీనస్థితిలో పాకిస్తాన్.. వెంటిలేటర్లు అందించాలంటూ భారత్‌ను సాయం కోరుతున్న అక్తర్..

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu