లాక్‌డౌన్‌ పొడిగించినా కరోనా వ్యాప్తి తగ్గదు: ఫిచ్‌ సొల్యూషన్స్‌

| Edited By:

Apr 23, 2020 | 7:18 AM

లాక్‌డౌన్‌ పొడిగించినా దేశంలో కరోనా కేసుల ఉధృతి తగ్గకపోవచ్చునని ఫిచ్‌ సొల్యూషన్స్ తెలిపింది. కరోనా వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు మే 3వరకు లాక్‌డౌన్ పొడిగించిన విషయం తెలిసిందే

లాక్‌డౌన్‌ పొడిగించినా కరోనా వ్యాప్తి తగ్గదు: ఫిచ్‌ సొల్యూషన్స్‌
Follow us on

లాక్‌డౌన్‌ పొడిగించినా దేశంలో కరోనా కేసుల ఉధృతి తగ్గకపోవచ్చునని ఫిచ్‌ సొల్యూషన్స్ తెలిపింది. కరోనా వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు మే 3వరకు లాక్‌డౌన్ పొడిగించిన విషయం తెలిసిందే. అయితే ఈ పొడిగింపు వలన కేసుల సంఖ్య తగ్గలేదని ఆ సంస్థ తెలిపింది. ప్రభుత్వం నెమ్మదిగా తీసుకుంటోన్న నిర్ణయాల వలన ఆర్థిక సంక్షోభం ఎక్కువ కావొచ్చని ఫిచ్‌ సొల్యూషన్స్‌ పేర్కొంది. కరోనా వైరస్ ప్రభావంతో పరిస్థితులు దిగజారుతున్నాయని.. ప్రైవేట్ వ్యయాలు, పెట్టుబడులు తగ్గే అవకాశం ఉందని ఆ సంస్థ వెల్లడించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి రేటు 4.6 శాతం వరకు ఉండే అవకాశం ఉందని గతంలో అంచనా వేసిన ఫిచ్‌.. తాజాగా దీనిని 1.8శాతానికి తగ్గించింది.

దేశ జనాభాను దృష్టిలో పెట్టుకుంటే ఇది చాలా క్లిష సమయమని వివరించిన ఫిచ్.. భారత్‌లో ప్రతి పది లక్షల మందితో 257 మందికే కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయని తెలిపింది. దేశంలో మూడు వారాల సమయంలో కరోనా కేసుల సంఖ్య వందల నుంచి వేలల్లోకి చేరుకుందని పేర్కొంది. మార్చి చివరి వరకు 700 కేసులు ఉండగా.. మూడు వారాల్లో దేశంలో కరోనా కేసులు పెరిగి 20,000కు చేరిందని ఆ సందర్భంగా ఫిచ్‌ గుర్తు చేసింది.

Read This Story Also: ఏపీ పోలీస్ స్టేషన్‌లో కరోనా కలకలం.. క్వారంటైన్‌కు 25 మంది పోలీసులు..!