Breaking: తెలంగాణలో తొలి కరోనా మరణం..!

| Edited By:

Mar 28, 2020 | 7:38 PM

తెలంగాణలో కరోనా మొదటి మృతి నమోదైంది. హైదరాబాద్ లోని ఖైరతాబాద్ లో ఓ వృద్ధుడు(74) ఇవాళ మృతి చెందాడు.

Breaking: తెలంగాణలో తొలి కరోనా మరణం..!
Follow us on

తెలంగాణలో కరోనా మొదటి మృతి నమోదైంది. హైదరాబాద్ లోని ఖైరతాబాద్ లో ఓ వృద్ధుడు(74) కరోనాతో మృతి చెందాడు. ఈ విషయాన్ని తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం అతడి భార్య, కుమారుడు హోం క్వారెంటైన్లో ఉన్నట్లు ఆయన వెల్లడించారు. కాగా వృద్ధుడి మృతితో దేశంలో మొత్తం కరోనా మృతుల సంఖ్య 21కు చేరింది. ఇదిలా ఉంటే మరణించిన వృద్ధుడు ఇతర అనారోగ్య కారణాలతో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకోగా.. మరణించిన తరువాత అతడికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు తేలింది.

మంత్రి చెప్పిన వివరాల ప్రకారం.. నగరంలోకి కుత్బుల్లాపూర్‌కు చెందిన ఆ వ్యక్తి ఈ నెల 14న మతపరమైన కార్యక్రమం కోసం ఢిల్లీకి వెళ్లి.. 17న తిరిగి వచ్చాడు. మార్చి 20న అతడికి తీవ్ర జ్వరం రావడంతో పాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రావడంతో.. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నాడు. గురువారం రాత్రి అతడు మరణించినప్పటికీ.. నమూనాలను పరీక్షల నిమిత్తం పంపగా.. కరోనా పాజిటివ్‌గా తేలింది. మరోవైపు తెలంగాణలో ఇవాళ ఒక్క రోజే 6 కొత్త కేసులు నమోదయ్యాయని.. దీంతో  కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 65కు చేరిందని రాజేందర్ తెలిపారు.

Read This Story Also: Breaking: ఐసోలేషన్ సెంటర్‌కు ఏపీ ఎమ్మెల్యే