షాకింగ్‌..24 గంటల్లో 35 పాజిటివ్ కేసులు… హట్‌స్పాట్‌గా దేవబంద్..

యూపీలో అదుపులో ఉందనుకున్న కరోనా మహమ్మారి మళ్లీ పడగవిప్పుతోంది. సహరన్‌ పూర్‌ జిల్లాలో.. కరోనా కేసుల సంఖ్య అమాంతం పెరుగుతోంది. ఒక్క దేవబంద్‌ ప్రాంతంలోనే గడిచిన 24 గంటల్లో 35 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం దేవబంద్‌ కరోనా హాట్‌స్పాట్ జోన్‌గా ఉంది. రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో.. సహరన్‌పూర్‌ జిల్లా యంత్రాంగంలో టెన్షన్ వాతవరణం నెలకొంది. ప్రస్తుతం జిల్లాలో కరోనా సోకిన బాధితుల సంఖ్య 86కు చేరుకుంది. అయితే జిల్లాలో కరోనా వ్యాప్తికి తబ్లీఘీ […]

షాకింగ్‌..24 గంటల్లో 35 పాజిటివ్ కేసులు... హట్‌స్పాట్‌గా దేవబంద్..

Edited By:

Updated on: Apr 20, 2020 | 1:28 PM

యూపీలో అదుపులో ఉందనుకున్న కరోనా మహమ్మారి మళ్లీ పడగవిప్పుతోంది. సహరన్‌ పూర్‌ జిల్లాలో.. కరోనా కేసుల సంఖ్య అమాంతం పెరుగుతోంది. ఒక్క దేవబంద్‌ ప్రాంతంలోనే గడిచిన 24 గంటల్లో 35 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం దేవబంద్‌ కరోనా హాట్‌స్పాట్ జోన్‌గా ఉంది. రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో.. సహరన్‌పూర్‌ జిల్లా యంత్రాంగంలో టెన్షన్ వాతవరణం నెలకొంది.

ప్రస్తుతం జిల్లాలో కరోనా సోకిన బాధితుల సంఖ్య 86కు చేరుకుంది. అయితే జిల్లాలో కరోనా వ్యాప్తికి తబ్లీఘీ జమాత్‌ సభ్యులే కారణమని ఆరోపణలు వస్తున్నాయి. ఈ ప్రాంతానికి ముంబై, ఢిల్లీ, గుజరాత్‌, ఇండోనేషియాల నుంచి పలువురు ఈ దేవబంద్‌ దర్గాకు వచ్చినట్లు అనుమానిస్తున్నారు. వీరి ద్వారానే ఇక్కడ కరోనా వ్యాప్తి చెంది ఉంటుందని భావిస్తున్నారు. మరోవైపు ఇక్కడి ప్రజలు.. లాక్‌డౌన్‌ నిబంధనలను కూడా ఉల్లంఘిస్తున్నారని తెలుస్తోంది. దీంతో పోలీసులు డ్రోన్‌ కెమెరాల ద్వారా నిబంధనలను ఉల్లంఘిస్తున్న వారిని ట్రేస్‌ చేసే పనిలో పడుతున్నారు.