Corona Updates: కేరళలో కరోనా డేంజర్ బెల్స్..ఒకేరోజు 31 వేలకు పైగా కేసులు నమోదు! మూడో వేవ్‌కు సంకేతమా?

|

Aug 26, 2021 | 6:53 AM

కరోనా మూడోవేవ్ భయాల నేపథ్యంలో కేరళలో ఒక్కసారిగా కోవిడ్ కేసులు పెరిగాయి. ఆందోళన కలిగించే రీతిలో మరణాలు కూడా నమోదు అయ్యాయి.

Corona Updates: కేరళలో కరోనా డేంజర్ బెల్స్..ఒకేరోజు 31 వేలకు పైగా కేసులు నమోదు! మూడో వేవ్‌కు సంకేతమా?
Corona Third Wave
Follow us on

Corona Updates: కరోనా మూడోవేవ్ భయాల నేపథ్యంలో కేరళలో ఒక్కసారిగా కోవిడ్ కేసులు పెరిగాయి. ఆందోళన కలిగించే రీతిలో మరణాలు కూడా నమోదు అయ్యాయి. కేరళలో బుధవారం కరోనా సంక్రమణ భయానక గణాంకాలు తెరపైకి వచ్చాయి. గత 24 గంటల్లో, ఇక్కడ 31,445 కరోనా సోకినట్లు వెల్లడైంది. సంక్రమణ కారణంగా 24 గంటల్లో 215 మంది రోగులు మరణించారు. అదేవిధంగా కేరళ సానుకూలత రేటు కూడా 19.03%కి పెరిగింది. ఇక బుధవారం 20,271 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు, కేరళలో మొత్తం 38 లక్షల 83 వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి.  కరోనా కారణంగా ఇక్కడ ఇప్పటివరకూ మొత్తం 19 వేలకు పైగా ప్రజలు మరణించారు.

మరోవైపు కరోనా మూడో వేవ్ అంచనాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ సౌమ్య స్వామినాథన్ కాస్త ఉపశమనం కలిగించేలా బుధవారం భారత్ లో కరోనా వ్యాప్తి రేటు మునుపటి కంటే చాలా నెమ్మదిగా లేదా తక్కువగా ఉందని చెప్పారు. ఈ నేపథ్యంలో కరోనా కేసులు కేరళలో ఒక్కసారిగా పెరగడం కలవరం కలిగిస్తోంది. డాక్టర్ సౌమ్య భారతదేశంలో కోవిడ్ -19 ఇప్పుడు స్థానిక దశకు చేరుకుంటోందని చెప్పారు. అలాగే ఇది సాంకేతికంగా స్థానిక దశ (అంటే ఏదైనా అంటువ్యాధి ప్రభావం తక్కువ సంఖ్యలో వ్యక్తులకు లేదా ఒక నిర్దిష్ట ప్రాంతానికి పరిమితం)కు చేరుకుందని చెప్పారు. అంతేకాకుండా వైరస్ కూడా బలహీనపడిండానీ, ప్రజలు ఈ వ్యాధితో జీవించడం కూడా నేర్చుకుంటారనీ వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే.. ఇప్పుడు కేరళలో కరోనా కేసులు పెరగడంపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కాగా, భారతదేశంలో మూడో వేవ్ ప్రమాదంపై ఇప్పటికే కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలనీ, ఎటువంటి పరిస్థితి వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధపడాలని కోరింది. అక్టోబర్ నెల నాటికి కరోనా మూడో వేవ్ ఉధృతి ఉండవచ్చని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అంచనా వేస్తోంది. ప్రస్తుతం కేరళ కరోనా కేసుల నమోదు మూడో వేవ్ సంకేతంలా కనిపిస్తోందని నిపుణులు అంటున్నారు. ఈ పరిస్థితి చూస్తుంటే కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అంచనాలు నిజమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని అంటున్నారు.

ఏం చేయాలి?

కరోనా మొదటి, రెండవ దశల్లో జరిగిన తప్పులు పునరావృతం కాకుండా చూసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా రెండో వేవ్ ప్రారంభ సంకేతాలను ప్రజలు పెద్దగా పట్టించుకోకపోవడంతో పెను ముప్పు దాపురించింది. ఆ అనుభవం దృష్ట్యా చూస్తే.. కేరళలో ఒక్కసారిగా పెరిగిన కరోనా పాజిటివ్ కేసులు వార్నింగ్ బెల్స్ మోగించినట్టే అనుకోవచ్చు. అందువల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. అంతా బావుంది అనుకోవడం సరైన పధ్ధతి కాదు అని నిపుణులు అంటున్నారు. కరోనా టీకాలు వేయించుకోవడం ముఖ్యం. అవకాశం ఉన్నంతవరకూ టీకాలు తీసుకోవాలి. ఇక కరోనాను అడ్డుకోవడంలో ముఖ్యమైన చర్యలు.. ఒకరికి దూరంగా ఉండటం.. మాస్క్ ధరించడం..చేతులు శానిటైజ్ చేసుకోవడం తప్పనిసరిగా చేయాలి. అలాగే వివాహాలు.. పండుగలు వంటి సామాజిక కార్యక్రమాల్లో ప్రజలు తక్కువగా పాల్గొనేలా చూడాల్సిన అవసరం ఉంది. రద్దీ ప్రదేశాలకు సాధ్యమైనంత వరకూ దూరంగా ఉండటం మంచిది.

గత అనుభవాల దృష్ట్యా.. జాగ్రత్తలు తీసుకోకపోతే ముప్పు తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Also Read: Coronavirus Pandemic: కరోనా కాలంలో పెరిగిన ఆన్‌లైన్ బాధితులు.. స్మార్ట్ ఫోనే ప్రపంచంగా బతుకులు..

Coronavirus: భారతీయులు సంక్రమణతో జీవించడం నేర్చుకుంటారు.. కరోనా ఏ దశలో ఉందో చెప్పిన డబ్ల్యూహెచ్‌ఓ