ఢిల్లీలో పీక్ స్టేజీలో కరోనా వైరస్ కేసులు..ఎయిమ్స్ డైరెక్టర్

| Edited By: Pardhasaradhi Peri

Jul 21, 2020 | 12:16 PM

ఢిల్లీలో కరోనా వైరస్ కేసులు పీక్ స్టేజికి చేరుకున్నాయని ఎయిమ్స్ డైరెక్టర్ డా.రణదీప్ గులేరియా ఆందోళన వ్యక్తం చేశారు. దీన్ని తక్కువగా అంచనా వేయరాదన్నారు. తగిన జాగ్రత్తలు తీసుకుంటే అదుపు చేయవచ్ఛునన్నారు. నగరంలో కొన్ని ప్రాంతాల్లో..

ఢిల్లీలో పీక్ స్టేజీలో కరోనా వైరస్ కేసులు..ఎయిమ్స్ డైరెక్టర్
Follow us on

ఢిల్లీలో కరోనా వైరస్ కేసులు పీక్ స్టేజికి చేరుకున్నాయని ఎయిమ్స్ డైరెక్టర్ డా.రణదీప్ గులేరియా ఆందోళన వ్యక్తం చేశారు. దీన్ని తక్కువగా అంచనా వేయరాదన్నారు. తగిన జాగ్రత్తలు తీసుకుంటే అదుపు చేయవచ్ఛునన్నారు. నగరంలో కొన్ని ప్రాంతాల్లో ఈ వైరస్ కేసులు చాలా ఎక్కువగా ఉన్నాయని, ఇటీవల తగ్గిన చోట్ల మళ్ళీ పెరిగాయని ఆయన చెప్పారు. కాగా సోమవారం ఒక్కరోజే సుమారు వెయ్యి కరోనా కేసులు నమోదయ్యాయి. 35 మంది రోగులు మరణించారు. దీంతో ఇప్పటివరకు మృతుల  సంఖ్య 3,663 కి పెరగగా.. మొత్తం కేసుల సంఖ్య 1,23,747 కి చేరింది. ఆ మధ్య కేసులు తగ్గగానే ఇది కేజ్రీవాల్ మోడల్ అని అధికార ఆప్ పార్టీ ప్రకటించుకుంది. అయితే తమ చర్యలవల్లే చాలావరకు పరిస్థితి అదుపులోకి వచ్చిందని బీజేపీ కూడా ఆప్ కి కౌంటర్ వేసింది. ఇప్పుడు ఈ రెండు పార్టీలూ మౌనం వహించడం విశేషం.