తప్పుడు సమాచారం వ్యాప్తి.. ఏపీలో 60మందిపై కేసులు నమోదు..!

| Edited By:

Apr 12, 2020 | 10:26 AM

కరోనా వైరస్‌కు సంబంధించి సామాజిక మాధ్యమాల్లో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చెందిన వారిపై చర్యలు తీసుకుంటామని ఏపీ పోలీసులు ప్రకటించిన విషయం తెలిసిందే.

తప్పుడు సమాచారం వ్యాప్తి.. ఏపీలో 60మందిపై కేసులు నమోదు..!
Follow us on

కరోనా వైరస్‌కు సంబంధించి సామాజిక మాధ్యమాల్లో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చెందిన వారిపై చర్యలు తీసుకుంటామని ఏపీ పోలీసులు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 60మందిపై వారు కేసులు నమోదు చేశారు. వారిలో ఎక్కువగా చిత్తూరు, నెల్లూరు, కర్నూల్‌ జిల్లాలకు చెందిన వారు ఉన్నట్లు తెలిపారు. ఈ క్రమంలో పౌరులకు వచ్చే సందేహాలపై ఏపీ పోలీసులు సోషల్ మీడియాలో వివరణ ఇస్తున్నారు.

కాగా కరోనా నేపథ్యంలో కొన్ని పాత చిత్రాలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వాటిని నమ్మకండని అధికారులు చెబుతూనే వస్తున్నారు. అంతేకాదు వాటిని వ్యాపిస్తున్న వారిపై చర్యలు తప్పవని పోలీసులు సైతం హెచ్చరించారు. మరోవైపు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్న వీడియోలు, ఫొటోలను నిర్ధారించుకునేందుకు తెలంగాణలో ఫ్యాక్ట్ చెక్‌ పేరిట ఐటీ విభాగం ప్రత్యేకంగా ఓ వెబ్‌సైట్‌ నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. వారికి అందే ఫిర్యాదులను పరిశీలించి అవి నిజమో కాదో ఆ వెబ్‌సైట్ వెల్లడిస్తుంది.

Read This Story Also: బాలయ్యకు విలన్‌ ఎవరంటే..చక్కర్లు కొడుతోన్న ఆసక్తికర వార్త..!