క‌రోనా ఘంటికః క‌ర్నాట‌క‌లో మూడో మ‌ర‌ణం

క‌ర్నాట‌లో మూడో క‌రోనా మ‌ర‌ణం సంభ‌వించింది. తుమకూరు జిల్లాలో మొద‌టగా న‌మోదైన క‌రోనా పాజిటివ్ కేసు బాధితుడు మృతిచెందిన‌ట్లుగా అక్క‌డి వైద్య ఆరోగ్యశాఖ వెల్ల‌డించింది...

క‌రోనా ఘంటికః క‌ర్నాట‌క‌లో మూడో మ‌ర‌ణం

Edited By:

Updated on: Mar 27, 2020 | 3:32 PM

క‌ర్నాట‌లో మూడో క‌రోనా మ‌ర‌ణం సంభ‌వించింది. తుమ్మ‌కూరు జిల్లాలో మొట్ట‌మొద‌టిసారిగా న‌మోదైన క‌రోనా పాజిటివ్ కేసు బాధితుడు మృతిచెందిన‌ట్లుగా అక్క‌డి వైద్య ఆరోగ్యశాఖ స్ప‌ష్టం చేసింది. ఈ మేర‌కు డిప్యూటీ క‌మిష‌న‌ర్ డాక్ట‌ర్ కే,రాకేశ్ కుమార్ మీడియా స‌మావేశం ఏర్పాటు చేసి వివ‌రాలు వెల్ల‌డించారు.

ఈ మేర‌కు జిల్లాలోని సిరాకు చెందిన 65ఏళ్ల వ్య‌క్తి మార్చి 5న బెంగ‌ళూరు నుంచి రైలులో ఢిల్లీకి వెళ్లారు. మార్చి 7న ఢిల్లీ చేరుకున్నాడు. అక్క‌డ త‌న‌కు ఎక్క‌డా ల‌డ్జీ దొర‌క్క‌పోవ‌డంతో.. ఢిల్లీలోని జామియా మ‌సీదులోనే బ‌స‌చేశాడు. మార్చి 7 నుండి మార్చి 11 వ‌ర‌కు అత‌డు అక్క‌డే ఉన్నాడు. తిరిగి మార్చి 11న అత‌డు ఢిల్లీ నుంచి బ‌య‌ల్దేరి మార్చి 14న సిరా చేరుకున్నాడు.

ఆ త‌ర్వాత‌ జ్వ‌రం, ద‌గ్గు ల‌క్ష‌ణాలతో మార్చి 21న తుమ్మ‌కూరులోని ప్ర‌భుత్వ ఆస్ప‌త్రి వైద్యుల‌ను సంప్ర‌దించాడు. వైద్య ప‌రీక్ష‌ల అనంత‌రం మార్చి 24న తుమ్మ‌కూరు జిల్లా ఆస్ప‌త్రి ఐసోలేష‌న్ వార్డులో చేరాడు. మార్చి 25న ఆస్ప‌త్రి నుంచి డిశార్చ్ అయిన వ్య‌క్తి శుక్ర‌వారం ఉద‌యం 10.45 గంటల సమయంలో మృతిచెందిన‌ట్లుగా అధికారులు వెల్ల‌డించారు.