కరోనా అప్‌డేట్స్‌.. దేశంలో కొత్త కేసులు ఎన్నంటే

భారత్‌లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 47,638 కొత్త కేసులు నమోదు కాగా.. మొత్తం కేసుల సంఖ్య 84,11,724కు చేరింది.

కరోనా అప్‌డేట్స్‌.. దేశంలో కొత్త కేసులు ఎన్నంటే

Updated on: Nov 06, 2020 | 10:05 AM

Corona India Updates: భారత్‌లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 47,638 కొత్త కేసులు నమోదు కాగా.. మొత్తం కేసుల సంఖ్య 84,11,724కు చేరింది. ఇక గడచిన 24 గంటల్లో మొత్తం 670 మంది మృత్యువాతపడగా.. మొత్తం మృతి చెందిన వారి సంఖ్య 1,24,985కు చేరింది. ఇక 24 గంటల్లో 54,157 మంది కోలుకోగా.. ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 77,65,966కు చేరింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 5,20,773 యాక్టివ్ కేసులు ఉన్నాయి. (నితిన్ ‘భీష్మ’కు షాకింగ్ టీఆర్పీ రేటింగ్స్‌)

ఇక దేశంలో కరోనా రోగుల రికవరీ రేటు 92.32 శాతం ఉండగా.. దేశంలో నమోదైన మొత్తం కేసులలో యాక్టివ్ కేసుల శాతం 6.19గా ఉంది. ఇక మొత్తం నమోదైన కేసులలో మరణాల రేటు 1.49 శాతానికి తగ్గింది. (జీవిత ఖైదు మహిళల విషయంలో.. జగన్ సర్కార్ సంచలన నిర్ణయం)

Loading...
Unable to load recommendations.
Follow Us