ప్రపంచాన్ని పీడిస్తున్న కరోనా వైరస్.. 62 లక్షలకి చేరిన కరోనా కేసులు

కరోనా వైరస్ మహమ్మారి మరింత వికృత రూపం దాల్చింది. ఈ వైరస్ దెబ్బకు ఆర్థిక వ్యవస్థలన్నీ అతలాకుతలమయ్యాయి. రోజురోజుకీ కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ వైరస్ ఎటు నుంచి ఎలా ఎటాక్ చేస్తుందో ఎవరికీ అర్థం కావట్లేదు. తాజాగా ప్రపంచవ్యాప్తంగా 109051 కొత్త కేసులు నమోదవ్వగా..

ప్రపంచాన్ని పీడిస్తున్న కరోనా వైరస్.. 62 లక్షలకి చేరిన కరోనా కేసులు

Edited By:

Updated on: Jun 01, 2020 | 9:12 AM

కరోనా వైరస్ మహమ్మారి మరింత వికృత రూపం దాల్చింది. ఈ వైరస్ దెబ్బకు ఆర్థిక వ్యవస్థలన్నీ అతలాకుతలమయ్యాయి. రోజురోజుకీ కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ వైరస్ ఎటు నుంచి ఎలా ఎటాక్ చేస్తుందో ఎవరికీ అర్థం కావట్లేదు. తాజాగా ప్రపంచవ్యాప్తంగా 109051 కొత్త కేసులు నమోదవ్వగా.. మొత్తం కేసుల సంఖ్య 62,59,533కి చేరాయి. అలాగే నిన్న 3185 మంది చనిపోవడంతో మొత్తం మరణాల సంఖ్య 3,73,691కి చేరింది. అయితే రికవరీ కేసులు కూడా భారీ ఎత్తున పెరగడం కాస్త ఊరటను ఇచ్చే విషయం. అలాగే 3100367 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. వీరిలో 53416 పేషెంట్లు ఐసీయూలో ఉన్నారు.

ఇక అమెరికాలో అయితే కరోనా.. మరణ మృదంగం వాయిస్తోంది. ఒక్కోసారి తగ్గుతూ.. ఒక్కోసారి అమాంతంగా కోవిడ్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. తాజాగా అమెరికాలో 20,705 కొత్త కేసులు నమోదయ్యాయి. అలాగే 633 మంది కోవిడ్‌తో మరణించారు. అమెరికాలో మూడ్రోజులుగా కొత్త కేసులు, మరణాలు తగ్గుతున్నాయి. ఇక ఓవరాల్‌గా చూస్తే బ్రెజిల్, స్పెయిన్, ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్, టర్కీ దేశాల్లో కరోనా తీవ్రత తగ్గుతూ, పెరుగుతూ ఉంది. అలాగే భారత్ విషయానికి వస్తే.. తాజాగా 8,380 కరోనా కేసులు నమోదవ్వగా.. దీంతో మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 182143కి చేరింది. అలాగే నిన్న 193 మంది ప్రాణాలు కోల్పోవడంతో.. మొత్తం మరణాల సంఖ్య 5164 అయ్యింది. కాగా ప్రపంచంలో ఎక్కువ కరోనా కేసులున్న దేశాల్లో భారత్ 7వ స్థానానికి చేరింది. అలాగే మరణాలు సంభవించిన దేశాల్లో భారత్ 13వ స్థానంలో ఉంది.

ఇది కూడా చదవండి:

రైతులకు కేంద్రం అందించే బంపర్ ఆఫర్.. చివరి తేదీ ఇదే!

‘ఆ బడా డైరెక్టర్ బాగోతం బయటపెడతా’.. బిగ్‌బాస్ నందినీ సంచలన కామెంట్స్