అక్క‌డ‌లా..ఇక్క‌డిలా..ప్ర‌తాపం చూపుతోన్న క‌రోనా

|

May 15, 2020 | 2:18 PM

దేశంలోనే అత్య‌ధిక క‌రోనా కేసుల‌తో మ‌హారాష్ట్ర‌, గుజ‌రాత్, త‌మిళ‌నాడు రాష్ట్రాలు ముందు వ‌రుస‌లో ఉన్నాయి. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో క‌రోనా కేసుల సంఖ్య ఆస‌క్తిక‌రంగా మారింది.

అక్క‌డ‌లా..ఇక్క‌డిలా..ప్ర‌తాపం చూపుతోన్న క‌రోనా
Follow us on

భార‌త్‌లో క‌రోనా ఉధృతి కొన‌సాగుతోంది. దేశంలో తాజాగా క‌రోనా  కేసుల‌పై హెల్త్ బులిటెన్ విడుద‌ల చేశారు వైద్య శాఖ అధికారులు.ప్ర‌స్తుతం దేశంలో 81,970 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో 3,967 క‌రోనా కేసులు కొత్త‌గా న‌మోదు కాగా.100 మంది వైర‌స్ బారిన ప‌డి ప్రాణాలు కొల్పోయారు. 51,401 మంది ప్ర‌స్తుతం చికిత్స పొందుతుండ‌గా, 27, 919 మంది డిశ్చార్జ్ అయిన‌ట్లు అధికారులు వెల్ల‌డించారు. దేశ‌వ్యాప్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం 2, 649 మంది క‌రోనా బారిన‌ప‌డి మృతి చెందారు. కాగా, దేశంలోనే అత్య‌ధిక క‌రోనా కేసుల‌తో మ‌హారాష్ట్ర‌, గుజ‌రాత్, త‌మిళ‌నాడు రాష్ట్రాలు ముందు వ‌రుస‌లో ఉన్నాయి. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో క‌రోనా కేసుల సంఖ్య ఆస‌క్తిక‌రంగా మారింది.

గ‌త ఐదు రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో న‌మోద‌వుతున్న క‌రోనా కేసుల సంఖ్య ఆస‌క్తిక‌రంగా మారింది. ఆరు రోజుల క్రితం వ‌ర‌కు తెలంగాణ‌తో పోలిస్తే..ఏపీలో కోవిడ్ పాజిటివ్ అధిక కేసులు న‌మోదు అయ్యాయి. అయితే ఐదు రోజుల నుంచి వైర‌స్ దిశ మార్చుకున్న‌ట్లుగా క‌నిపిస్తోంది. ఈ ఐదు రోజులుగా  తెలంగాణ‌లో ఎక్కువ కేసులు న‌మోదు అవుతుండ‌గా.. ఏపీలో కేసుల సంఖ్య క్ర‌మంగా త‌గ్గుముఖం ప‌డుతోంది.  వ‌ల‌స కూలీలు తెలంగాణ‌కు వ‌స్తుండ‌టంతోనే కేసుల సంఖ్య పెరుగుతున్నాయిని అధికారులు భావిస్తున్నారు. ఇక  ఏపీలో క‌రోనా కేసుల సంఖ్య 2100గా ఉండ‌గా, తెలంగాణ‌లో ఆ సంఖ్య  1,414కు చేరింది.

ఆంధ్రప్రదేశ్ లో గురువారం(మే14న‌) కొత్తగా మరో 36 మందికి కరోనా సోకింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2100కు చేరింది. కరోనా కారణంగా రాష్ట్రంలో మృతిచెందిన వారి సంఖ్య‌ 48కి పెరిగింది. ఇక తెలంగాణలో కరోనా విజృంభణ ఆగడం లేదు. నిన్న ఒక్క‌రోజే ష్ట్రంలో కొత్తగా 47 కేసులు నమోదయ్యాయి. అందులో 40 కేసులు జీహెచ్‌ఎంసీ పరిధిలోనివి కాగా.. రంగారెడ్డి జిల్లాలో 2, మరో ఇద్దరు వలస కార్మికులు ఉన్నారు. దీంతో రాష్ట్రంలో నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 1,414కు చేరింది. 24 గంటల్లో 13 మంది కోలుకోగా.. ఈ వైరస్‌తో మరణించిన వారి సంఖ్య 34కు చేరింది.
Read This: తెలంగాణలో లాక్ డౌన్ కొనసాగింపా.. పొడిగింపా..!