బ్రేకింగ్.. ఢిల్లీ ఏపీ భవన్‌లో అధికారికి కరోనా..

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలన్నింటిని వణికిస్తోంది. ఇప్పటికే డెబ్బై లక్షలకు చేరువలో కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక వీటిలో నాలుగు లక్షల మందికి పైగా మరణించారు.

బ్రేకింగ్.. ఢిల్లీ ఏపీ భవన్‌లో అధికారికి కరోనా..

Updated on: Jun 07, 2020 | 6:51 PM

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలన్నింటిని వణికిస్తోంది. ఇప్పటికే డెబ్బై లక్షలకు చేరువలో కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక వీటిలో నాలుగు లక్షల మందికి పైగా మరణించారు. ఇక మనదేశంలో కూడా ఈ వైరస్ విజృంభిస్తోంది. ఇప్పటికే రెండున్నర లక్షలకు చేరువలో కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. సామాన్యులను మొదలుకొని.. అన్ని వర్గాల ప్రజలను ఈ వైరస్ టచ్ చేస్తోంది. ముఖ్యంగా ఢిల్లీలో ఈ వైరస్ ప్రభావం మరింత ఎక్కువగా ఉంది. తాజాగా శనివారం నాడు ఈడీ కార్యాలయానికి చెందిన అధికారులకు కరోనా సోకగా.. ఇప్పుడు ఏపీ భవన్‌లోని అధికారికి కరోనా సోకింది. దీంతో వెంటనే ఆయన్ను ఢిల్లీలోని కంటోన్మెంట్‌ల ఆస్పత్రికి తరలించారు. వెంటనే ఏపీ భవన్‌లోని ఆంధ్రా, తెలంగాణ రెసిడెంట్ కమిషనర్ కార్యాలయాలను సీల్ చేశారు. శానిటైజేషన్ చేసి.. రెండు రోజుల తర్వాత తెరవాలని అధికారులు తెలిపారు.

Loading...
Unable to load recommendations.
Follow Us