జ‌గిత్యాల‌లో లారీ డ్రైవ‌ర్‌కు క‌రోనా !

|

May 07, 2020 | 2:06 PM

తెలంగాణ‌లోని జ‌గిత్యాల జిల్లాలో ఒక్క‌సారిగా అల‌జ‌డి రేగింది. ఓ లారీ డ్రైవ‌ర్‌కు క‌రోనా వైర‌స్ ల‌క్ష‌ణాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. దీంతో జిల్లా యంత్రాంగం ఒక్క‌సారిగా ఉలిక్కి ప‌డింది.

జ‌గిత్యాల‌లో లారీ డ్రైవ‌ర్‌కు క‌రోనా !
Follow us on
తెలంగాణ‌లోని జ‌గిత్యాల జిల్లాలో ఒక్క‌సారిగా అల‌జ‌డి రేగింది. ఓ లారీ డ్రైవ‌ర్‌కు క‌రోనా వైర‌స్ ల‌క్ష‌ణాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. దీంతో జిల్లా యంత్రాంగం ఒక్క‌సారిగా ఉలిక్కి ప‌డింది. వెంట‌నే అత‌న్ని క్వారంటైన్‌కి త‌ర‌లించారు. పూర్తి వివ‌రాలు ప‌రిశీలించ‌గా…
కరోనా అనుమానంతో సూర్యాపేటకు చెందిన ఓ లారీ డ్రైవర్‌ను జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో అధికారులు గుర్తించి  జగిత్యాల హోమ్ క్వారంటైన్ కు తరలించారు. ఏప్రిల్ 30న సదరు లారీ డ్రైవర్ సిమెంట్ లోడుతో లక్షెట్టిపేటకు చేరుకున్నాడు. అన్లోడ్ చేసిన తరువాత లక్షెట్టిపేట నుంచి ఖమ్మంకు చెందిన ఇద్దరు వలస కూలీల ను తన లారీలో ఖమ్మం తీసుకు వెళ్లాడు. ఆ ఇద్దరిలో ఒకరికి కరోనా పాజిటివ్‌గా తేలడంతో ఖమ్మం అధికారులు అప్రమత్తమయ్యారు.
పాజిటివ్ బాధితుడి సమాచారం మేరకు సూర్యాపేటకు చెందిన లారీ డ్రైవర్ గురించి విచారించారు. లారీ డ్రైవర్ సిమెంటు లోడ్‌ను ఇబ్రహీంపట్నం తీసుకువెళ్లాడని గుర్తించిన ఖమ్మం అధికారులు ఇబ్రహీంపట్నం రెవెన్యూ, పోలీస్ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఖమ్మం అధికారులు ఇచ్చిన సమాచారంతో ఇబ్రహీంపట్నం తహసీల్దార్, ఎస్‌ఐ అశోక్  లారీ డ్రైవర్ ను గుర్తించి జగిత్యాలకు పంపించారు.