Corona Effect: సినిమా రంగంపై కరోనా సెకండ్‌ వేవ్‌ ప్రభావం.. బడా సినిమాల షూటింగ్‌లకు బ్రేక్‌..

|

Apr 15, 2021 | 6:53 PM

Corona Effect: కరోనా సెకండ్‌ వేవ్‌ దేశవ్యాప్తంగా తన పంజాను విసురుతోంది. గతేడాదిని మించి కొత్త కేసులు నమోదవుతుండడంతో ఆందోళన పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల...

Corona Effect: సినిమా రంగంపై కరోనా సెకండ్‌ వేవ్‌ ప్రభావం.. బడా సినిమాల షూటింగ్‌లకు బ్రేక్‌..
Movie Shootings
Follow us on

Corona Effect: కరోనా సెకండ్‌ వేవ్‌ దేశవ్యాప్తంగా తన పంజాను విసురుతోంది. గతేడాదిని మించి కొత్త కేసులు నమోదవుతుండడంతో ఆందోళన పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు లాక్‌ దిశగా అడుగులు వేస్తున్నాయి. మరీ ముఖ్యంగా మహారాష్ట్రలో కరోనా కేసులు, మరణాలు బెంబేలెత్తిస్తున్నాయి. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు కరోనా బారిన పడుతున్నారు. బాలీవుడ్‌ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ స్టార్‌లకు కరోనా సోకింది. దీంతో కొన్ని సినిమాల షూటింగ్‌లను స్వచ్చంధంగా వాయిదా వేసుకున్నారు.

ఇదిలా ఉంటే రాష్ట్రవ్యాప్తంగా సినిమా, టీవీ షూటింగ్‌లను నిలిపివేయాలని ప్రభుత్వం తాజాగా ఆదేశాలు జారీ చేసింది. కరోనా కేసులు విపరీతంగా పెరుగుతోన్న నేపథ్యంలో ఏప్రిల్‌ 14 సాయంత్రం నుంచి మే 1 వరకు లాక్‌డౌన్‌ విధించింది, కొత్త మార్గదర్శకాలను కూడా ప్రభుత్వం జారీ చేసింది. దీంతో కరోనా నిబంధనలు పాటిస్తూ షూటింగ్ జరుపుకుంటున్న చిత్రాలు సైతం వాయిదా పడ్డాయి. ఈ క్రమంలోనే ప్రముఖ స్టా్ర్‌లు నటిస్తోన్న చిత్రాలు షూటింగ్‌కు ప్యాకప్‌ చెప్పాయి. వాటిలో ప్రధానమైనవి.. షారుక్‌ ఖాన్‌ లీడ్‌ రోల్‌లో నటిస్తోన్న  ‘పఠాన్‌ ’, సల్మాన్‌ ఖాన్‌  ‘టైగర్‌ 3’, అమితాబ్‌బచ్చన్‌ ‘గుడ్‌ బై’ , కార్తీక్‌ ఆర్యన్‌  ‘భూల్‌ భులయ్యా 2’ వంటి బడా చిత్రాలు వాయిదా పడ్డాయి. ఈ సంఘటనలు చూస్తుంటే మళ్లీ గతేడాది పరిస్థితులు పునరావృతం అవుతున్నట్లు కనిపిస్తోంది. మరి చూడాలి కరోనా దాడికి ఎక్కడ ఫుల్‌స్టాప్‌ పడుతుందో.

Also Read: AP Corona cases: ఏపీలో కట్టు తప్పుతున్న కరోనా వైరస్.. 5 వేలు దాటిన పాజిటివ్ కేసులు.. సీఎం జగన్ కీలక ఆదేశాలు

Madhya Pradesh: కరోనా మరణాలను ఎవరూ ఆపలేరు…మంత్రి వెటకారపు మాటలపై వివాదం!

Corona cases: గల్లీ నుంచి ఢిల్లీ వరకు హాట్ స్పాట్ సెంటర్లు.. తెలంగాణలోని ఆ జల్లాలో పెరుగుతున్న కరోనా విలయతాండవం..