ప్రపంచవ్యాప్తంగా 27 మిలియన్లకు చేరువలో కరోనా కేసులు..

ప్రపంచాన్ని కరోనా వైరస్ వణికిస్తోంది. దేశాలన్నీ కూడా దశల వారీగా అన్ లాక్ ప్రక్రియను మొదలుపెట్టడంతో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంది. రోజురోజుకూ పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది.

ప్రపంచవ్యాప్తంగా 27 మిలియన్లకు చేరువలో కరోనా కేసులు..

Updated on: Sep 05, 2020 | 8:24 PM

Corona Cases In World: ప్రపంచాన్ని కరోనా వైరస్ వణికిస్తోంది. దేశాలన్నీ కూడా దశల వారీగా అన్ లాక్ ప్రక్రియను మొదలుపెట్టడంతో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంది. రోజురోజుకూ పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటివరకు ఈ వైరస్ 213 దేశాలకు పాకింది. తాజా సమాచారం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 26,857,679 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 880,075 మంది కరోనాతో చనిపోయారు. ఇదిలా ఉంటే 18,977,917 ఈ వైరస్ బారి నుంచి కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. గడిచిన 24 గంటల్లో ప్రపంచంలో అత్యధికంగా 2,99,181 పాజిటివ్ కేసులు, 5794 మరణాలు సంభవించాయి. అమెరికా, బ్రెజిల్, రష్యా దేశాల్లో కరోనా తీవ్రతరంగా ఉంది. అగ్రరాజ్యం అమెరికాలో అత్యధిక కేసులు(6,392,303), మరణాలు(192,168) సంభవించాయి. ఇక భారత్‌లో కరోనా కేసులు 4,047,653 నమోదు కాగా, మృతుల సంఖ్య 69,920కి చేరింది.

Also Read: గ్రామ సచివాలయ అభ్యర్థులకు ముఖ్య గమనిక.. 12 నుంచి ఆన్‌లైన్‌లో హాల్‌టికెట్లు..

Loading...
Unable to load recommendations.
Follow Us