హాలీవుడ్‌ను వెంటాడుతోన్న కరోనా.. ప్రముఖ హీరోయిన్‌కు పాజిటివ్..!

| Edited By:

Mar 17, 2020 | 2:11 PM

కరోనా.. కరోనా.. ఇప్పుడు ఎక్కడ విన్నా ఇదే మాట. కులం, మతం, రంగు బేధం లేకుండా ప్రపంచం మొత్తాన్ని ఈ వైరస్ వణికిస్తోంది. సామాన్యులు మొదలుకొని సినీ, రాజకీయ, క్రీడ.. ఇలా అన్ని రంగాల ప్రముఖుల్లోని పలువురిని ఈ వ్యాధి భయపెడుతోంది.

హాలీవుడ్‌ను వెంటాడుతోన్న కరోనా.. ప్రముఖ హీరోయిన్‌కు పాజిటివ్..!
Follow us on

కరోనా.. కరోనా.. ఇప్పుడు ఎక్కడ విన్నా ఇదే మాట. కులం, మతం, రంగు బేధం లేకుండా ప్రపంచం మొత్తాన్ని ఈ వైరస్ వణికిస్తోంది. సామాన్యులు మొదలుకొని సినీ, రాజకీయ, క్రీడ.. ఇలా అన్ని రంగాల ప్రముఖుల్లోని పలువురిని ఈ వ్యాధి భయపెడుతోంది. తాజాగా తాను కరోనా బారిన పడ్డట్లు వెల్లడించారు హాలీవుడ్ నటి, జేమ్స్‌బాండ్ హీరోయిన్లలో ఒకరైన ఓల్గా కుర్యలెంకో. ఈ మేరకు సోషల్ మీడియాలో ఆమె వెల్లడించారు.

”కరోనా వైరస్ పాజిటివ్ రావడంతో ఇంట్లో బంధీగా మారిపోయా. ఒక వారం నుంచి నాకు కాస్త అనారోగ్యంగా ఉంది. జ్వరం, అలసట‌తో బాధపడుతున్నా. మిమ్మల్ని మీరు రక్షించుకోండి. కరోనాను సీరియస్‌గా తీసుకోండి” అంటూ ఆమె కామెంట్ పెట్టారు. కాగా ఆస్కార్ అవార్డు గ్రహీత, హాలీవుడ్ నటుడు టామ్ హాంక్స్, ఆయన భార్య రీటా విల్సన్ కూడా కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చికిత్స తీసుకున్న వారు కరోనాను జయించి.. తాజాగా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. మరోవైపు కరోనా ప్రపంచవ్యాప్తంగా సినీ ఇండస్ట్రీపై కూడా ప్రభావాన్ని చూపిన విషయం తెలిసిందే.

Read This Story Also: అలియా విషయంలో రాజమౌళి టెన్షన్.. ఆ సీన్ రిపీట్ అవుతుందా..!