కరోనా ఎఫెక్ట్‌తో మరో కీలక నిర్ణయం తీసుకున్న మోదీ సర్కార్

| Edited By:

Apr 10, 2020 | 2:41 PM

ఎంపీల జీత భత్యాల్లో కోత విధించగా, ఖర్చులను తగ్గించుకునే పనిలో పడింది. బడ్జెట్‌లో వివిధ శాఖలకు కేటాయించిన నిధుల్లో 15 శాతం వరకు ఖర్చుపై నియంత్రణ విధించి. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ కార్యాలయం మొమొరాండం జారీ..

కరోనా ఎఫెక్ట్‌తో మరో కీలక నిర్ణయం తీసుకున్న మోదీ సర్కార్
Follow us on

కరోనా ఎఫెక్ట్‌తో.. ప్రధాని నరేంద్ర మోదీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా దెబ్బకు దేశ ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. ఇప్పటికే ప్రపంచ బ్యాంకు వద్ద అప్పు కూడా తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. అలాగే ఎంపీల జీత భత్యాల్లో కోత విధించగా, ఖర్చులను తగ్గించుకునే పనిలో పడింది. బడ్జెట్‌లో వివిధ శాఖలకు కేటాయించిన నిధుల్లో 15 శాతం వరకు ఖర్చుపై నియంత్రణ విధించి. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ కార్యాలయం మొమొరాండం జారీ చేసింది. మంత్రిత్వ శాఖలు, విభాగాలు, ఇతర సంస్థలను మూడు కేటగిరీలుగా విభజించింది ఆర్థిక శాఖ.

ఏ కేటగిరీలో 18 శాఖలు, విభాగాలు పూర్తి స్థాయి నిధులను వినియోగించుకునే వెసులుబాటును కల్పించింది. అలాగే బీ కేటగిరీలో చేర్చిన 33 శాఖలకు 20 శాతం, సీ కేటగిరీలో చేర్చిన 50 శాఖలకి 15 శాతం నియంత్రణ విధించింది. ఈ ఉత్వర్వులు ఏప్రిల్-జూన్ త్రైమాసికానికి అమల్లో ఉంటాయని కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. లాక్‌డౌన్ ఎఫెక్ట్‌తో రాబడిపై ప్రతికూల ప్రభావం ఉండే అవకాశం ఉన్నందున్న ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది కేంద్ర ప్రభుత్వం. ఇక పౌరవిమానయాన శాఖ, ఫార్మాసూటికల్, ఆరోగ్య శాఖ, ఆయూష్ శాఖ, వినియోగదారుల వ్యవహారాలు, గ్రామీణాభివృద్ధి, రైల్వే విభాగంతో పాటు సుప్రీం కోర్టు, సీవీసీ, యూపిఎస్సీ, రాష్ట్రపతి భవన్‌లు మొత్తం నిధులను వాడుకునే విధంగా.. ఆర్థిక శాఖ వెసులుబాటు కల్పించింది.

ఇవి కూడా చదవండి:

జబర్దస్త్‌లో ఉన్న కమెడియన్స్ అందరూ నాగబాబువైపే ఉన్నారు.. కుండబద్దలు కొట్టిన ధన్‌రాజ్

బ్రేకింగ్: సినీ నటుడు నర్సింగ్‌ యాదవ్‌కు తీవ్ర అస్వస్థత..

తెల్లరేషన్ కార్డుదారులకు గుడ్‌న్యూస్.. 17 రకాల వస్తువులతో కిట్.. పూర్తిగా ఫ్రీ

సీఎం కొత్త నిర్ణయం.. విలేజ్, వార్డు క్లీనిక్స్ ఏర్పాటు..

పిడుగుపాటు.. ఎమ్మెల్యే, కుటుంబసభ్యులకు తృటిలో తప్పిన ప్రమాదం