దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి తీవ్రంగా విజృంభిస్తోన్న సంగతి తెలిసింది. రోజు రోజుకీ కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఎంతో మంది రాజకీయ నాయకులు, సినీ సెలబ్రిటీలు, పోలీసులు, వైద్యులు ఈ వైరస్ బారిన పడి మరణించారు. ఇక తాజాగా తమిళనాడు రాష్ట్రంలో 32 మంది డాక్టర్లు మృతి చెందినట్లు ఇండియన్ మెడికల్ అసోసియేషన్, తమిళనాడు బ్రాంచి వెల్లడించింది. అలాగే మరో 15 మంది డాక్టర్లు కూడా కోవిడ్ లక్షణాలతో చనిపోయారు. కానీ వారికి పరీక్షలు చేస్తే కరోనా నెగిటివ్ వచ్చినట్టు వారు పేర్కొన్నారు. వైద్యుల పట్ల ప్రభుత్వం సరైన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. కానీ ప్రభుత్వం మత్రం పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు వైద్యులు.
ఇక దేశ వ్యాప్తంగా కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య విషయంలో రెండో స్థానంలో ఉంది తమిళనాడు రాష్ట్రం. 3,32,105 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదవ్వగా, ఇప్పటివరకు 5,641 మంది మృతి చెందారు. అలాగే 2,72,251 మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 54,213 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
Read More:
ఈ రోజు నుంచి రేపల్లెలో పూర్తిస్థాయి లాక్‌డౌన్