Corona Virus Cases: దేశ వ్యాప్తంగా కరోనా కోరలు చాస్తుంది. ఇప్పటికే పలు రాష్ట్రాలు స్వయంగా లాక్ డౌన్ విధించుకుంటున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో సైతం కరోనా పంజా విసురుతుంది. ఇక ఆంద్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో 35,922 పరీక్షలు నిర్వహించగా… 6,582 నిర్ధారణ అయ్యాయి. తాజా కేసులతో కలిసి ఇప్పటి వరకు రాష్ట్రంలో 9,62,037 మంది వైరస్ భారిన పడినట్లు రాష్టర వైద్య రోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల వ్యవధిలో కోవిడ్ వల్ల 22 మంది కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. చిత్తూరులో ఐదుగురు, కృష్ణా, నెల్లూరులో నలుగురు చొప్పున, కర్నూల్లో ముగ్గురు, అనంతపురం, గుంటూరులో ఇద్ధరేసి, విశాఖ, విజయనగరం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 7,410కి చేరింది.
ఇక రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 24 గంటల వ్యవధిలో 2,343 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్నవారి సంఖ్య 9,09,941కి చేరినట్లుగా వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 44, 686 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 1,56,77,992 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది. రాష్ట్రంలో అత్యధికంగా చిత్తూరులో 1,171, అత్యల్పంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 82 కేసులు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాలో గత మూడు రోజులుగా వెయ్యికి పైగా కేసులు నమోదవుతున్నాయి.
Also Read: నా ఆరోగ్యం కుదుటపడుతోంది… త్వరలోనే మీ ముందుకు వస్తా.. పవన్ కళ్యాణ్ భావోద్వేగ లేఖ…
నాకు న్యాయం చేయండి.. సీసీఎస్ పోలీసులను ఆశ్రయించిన సీనియర్ నటుడు నరేష్..
Megastar Chiranjeevi: చిరు సినిమాలో కీలక పాత్రలో బాలీవుడ్ డైరెక్టర్.. నో చెప్పిన అనురాగ్ కశ్యప్..