Coronavirus: ఐఐటీ హైద‌రాబాద్‌లో భారీగా క‌రోనా కేసులు.. ఏకంగా 123 మంది పాజిటివ్‌..

|

Jan 13, 2022 | 6:03 AM

Coronavirus: క‌రోనా మ‌హ‌మ్మారి ఉధృతి రోజురోజుకీ పెరుగుతూనే ఉంది. ఇప్ప‌టికే దేశ వ్యాప్తంగా రోజువారీ కేసులు ల‌క్ష‌న్న‌ర దాటేశాయి. ఇక తెలంగాణ‌లోనూ క‌రోనా ఉగ్ర‌రూపం దాల్చుతోంది. ముఖ్యంగా...

Coronavirus: ఐఐటీ హైద‌రాబాద్‌లో భారీగా క‌రోనా కేసులు.. ఏకంగా 123 మంది పాజిటివ్‌..
Follow us on

Coronavirus: క‌రోనా మ‌హ‌మ్మారి ఉధృతి రోజురోజుకీ పెరుగుతూనే ఉంది. ఇప్ప‌టికే దేశ వ్యాప్తంగా రోజువారీ కేసులు ల‌క్ష‌న్న‌ర దాటేశాయి. ఇక తెలంగాణ‌లోనూ క‌రోనా (Coronavirus) ఉగ్ర‌రూపం దాల్చుతోంది. ముఖ్యంగా జీహెచ్ఎంసీ ప‌రిధిలో కేసులు విప‌రీతంగా పెరుగుతున్నాయి. ఇదే క్ర‌మంలోవిద్యా సంస్థ‌ల్లోనూ క‌రోనా కేసులు న‌మోద‌వుతున్నాయి. తాజాగా హైద‌రాబాద్ శివారుల్లో సంగారెడ్డికి స‌మీపంలో ఉన్న ఐఐటీ హైద‌రాబాద్ క్యాంప‌స్‌లో క‌రోనా ఒక్క‌సారిగా క‌ల‌క‌లం సృష్టించింది.

క్యాంప‌స్‌లో మొత్తం 123 మందికి క‌రోనా పాజిటివ్‌గా తేలింది. వీరిలో 107 మంది విద్యార్థులు కాగా మిగ‌తా వారిలో బోధ‌న‌, బోధ‌నేత‌ర సిబ్బంది ఉన్నారు. క‌రోనా పాజిటివ్‌గా తేలిన విద్యార్థుల‌కు క్యాంప‌స్‌లోని హాస్ట‌ల్స్‌లో హోం ఐసోలేష‌న్‌లో ఉంచి వైద్యులతో చికిత్స అందిస్తున్నారు. క్యాంప‌స్‌లో మ‌రిన్ని కేసులు పెరిగే అవ‌కాశం ఉంద‌ని సంగారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య‌శాఖ అధికారి డాక్ట‌ర్ గాయ‌త్రి దేవి తెలిపారు. ఒక్క క్యాంప‌స్‌లోనే వంద మందికి క‌రోనా సోక‌డంతో ఒక్క‌సారిగా ఉలిక్కిప‌డ్డారు. ఇదిలా ఉంటే జ‌న‌వ‌రి చివ‌రి నాటికి క‌రోనా కేసులు పీక్స్‌కి వెళ్లి ఫిబ్ర‌వరి చివ‌రి నాటికి పూర్తిగా త‌గ్గిపోతాయ‌ని నిపుణులు చెబుతున్నారు.

Also Read: IND VS SA: విరాట్ కోహ్లీ స్పెషల్ రికార్డు.. సెల్యూట్ చేసిన సునీల్ గవాస్కర్.. ఎందుకో తెలుసా?

Vastu Tips: పూజాగది ఈ దిక్కుగా ఉంటే చాలా మంచిదట.. అది ఎటువైపో తెలుసా..

NRI News: క్వారంటైన్ నిబంధనపై ప్రవాస భారతీయుల అభ్యంతరం.. ఇలా అయితే ఎలా అని ప్రశ్నిస్తున్న ఎన్ఆర్ఐలు!