రష్యాలో కొత్తగా మరో 4,870 పాజిటివ్ కేసులు

రష్యాలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గత కొద్ది రోజులుగా నిత్యం ఐదువేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవతున్నాయి. ఇప్పటికే రష్యా..

రష్యాలో కొత్తగా మరో 4,870 పాజిటివ్ కేసులు

Edited By:

Updated on: Aug 21, 2020 | 5:31 PM

రష్యాలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గత కొద్ది రోజులుగా నిత్యం ఐదువేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవతున్నాయి. ఇప్పటికే రష్యా వ్యాప్తంగా 9.4 లక్షలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రష్యన్‌ హెల్త్ డిపార్ట్‌మెంట్‌ తెలిపిన లెక్కల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో 4,870 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రష్యా వ్యాప్తంగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 9,46,976కి చేరింది. ఇక గడిచిన 24 గంటల్లో రష్యా వ్యాప్తంగా కరోనా బారినపడి 90 మంది మరణించారు. దీంతో ఇప్పటి వరకు రష్యా వ్యాప్తంగా కరోనా బారినపడి 16,189 మంది మరణించారు. ఇక ఇప్పటి వరకు రష్యా వ్యాప్తంగా కరోనా నుంచి కోలుకుని 7,61,330 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. మరో 2,22,304 మంది మెడికల్ అబ్జర్వేషన్‌లో ఉన్నారని అధికారులు తెలిపారు.

కాగా, ఇప్పటి వరకు 33.8 మిలియన్ కరోనా టెస్టులు నిర్వహించినట్లు రష్యన్ ప్రభుత్వం వెల్లడించింది. ఇదిలావుంటే.. ఇప్పటికే రష్యా కరోనా మహమ్మారికి వ్యాక్సిన్‌ కనుగొన్న సంగతి తెలిసిందే. అయితే దీనికి ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి ఎలాంటి ఆమోదం రాలేదు. ఈ వ్యాక్సిన్‌పై మిశ్రమ స్పందన వస్తోంది. ఫైనల్‌ ఫేస్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించకుండా దీనిపై ఎలా నమ్మకం పెట్టుకోగలమంటూ అనుమానాలను లేవనెత్తుతున్నారు.

Read More :

గుండెపోటుతో బీజేపీ ఎమ్మెల్యే కన్నుమూత

కేంద్రమంత్రికి పాజిటివ్‌.. క్వారంటైన్‌లోకి హర్యానా సీఎం