ఏపీలో కరోనా పంజా విసురుతోంది. రాష్ట్రంలో ఒక్కసారిగా కేసుల సంఖ్య అమాంతం పెరిగిపోయింది. రాష్ట్రంలో గత 24 గంటల్లో జరిగిన కోవిడ్-19 పరీక్షల్లో 75 కేసులు పాజిటివ్ గా నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 722కు చేరింది. అలాగే గడిచిన 24 గంటల్లో కరోనాతో ముగ్గురు మరణించారు.. దీంతో మృతుల సంఖ్య 20కి చేరింది..ఇక మొత్తం 92 మంది డిశ్చార్జ్ కాగా ప్రస్తుతం వివిధ ఆస్పత్రుల్లో 610 మంది చికిత్స పొందుతున్నారు.
తాజాగా నమోదైన 75 కేసుల్లో 25 కేసులు చిత్తూరు జిల్లాలో, గుంటూరులో 20, కర్నూలు 16 లో నమోదయ్యాయి.. అనంతపురంలో 4, తూర్పుగోదావరి జిల్లాలో 2, కడపలో 3, కృష్ణా జిల్లాలో 5 వైరస్ పాజిటివ్ కొత్త కేసులు నమోదయ్యాయి..రాష్ట్రంలో గుంటూరు, కర్నూలు జిల్లాల్లో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. కర్నూలు జిల్లాలో 174 కేసులు నమోదు కాగా, వారిలో అయిదుగురు మరణించారు గుంటూరు జిల్లాలో 149 మంది కరోనా బారిన పడ్డారు. నలుగురు మరణించారు.. అనంతపురం 33 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ముగ్గురు మృత్యువాత పడ్డారు.