తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు.. అక్కడలా.. ఇక్కడిలా..

రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ తీవ్రంగా విజృంభిస్తోంది. ఒక రోజు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుంటే.. మరొక రోజు తగ్గుతూ ఉన్నాయి. కాగా  తెలంగాణలో గురువారం నాడు కొత్తగా మరో 127 కేసులు నమోదయ్యాయి. వీటిలో అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్...

తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు.. అక్కడలా.. ఇక్కడిలా..

Edited By:

Updated on: Jun 05, 2020 | 7:26 AM

రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ తీవ్రంగా విజృంభిస్తోంది. ఒక రోజు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుంటే.. మరొక రోజు తగ్గుతూ ఉన్నాయి. కాగా  తెలంగాణలో గురువారం కొత్తగా మరో 127 కేసులు నమోదయ్యాయి. వీటిలో అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోనే నమోదయ్యాయి. ఏకంగా 110 కేసులు జీహెచ్‌ఎంసీ పరిధిలోనే నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్‌లో పేర్కొంది.

ఇక జిల్లాల వారీగా.. ఆదిలాబాద్‌ 7 కేసులు, రంగారెడ్డిలో 6, మేడ్చల్‌లో 2, సంగారెడ్డి, ఖమ్మం జిల్లాల్లో ఒక్కో కేసు నమోదయ్యాయి. గురువారం నాడు నమోదైన కేసులతో రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కేసుల సంఖ్య 3,147కు చేరింది. ఇక గడిచిన 24 గంటల్లో కరోనా బారినపడి ఆరుగురు మరణించారు. దీంతో ఇప్పటి వరకు కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య 105కు చేరింది. ప్రస్తుతం ఆస్పత్రుల్లో ఉన్న యాక్టివ్ కేసుల సంఖ్య 1455 కాగా.. కరోనా బారినుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి 1587 మంది కోలుకున్నారు.

ఇక ఏపీ విషయానికొస్తే.. రాష్ట్రంలో కొత్తగా 98 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్తవాటితో కలిపి ఇప్పటివరకు కరోనా కేసులు 3,377కి చేరాయి. కరోనాతో నిన్న ముగ్గురు మరణించగా.. రాష్ట్రంలో మొత్తం ఇప్పటివరకూ కోవిడ్‌తో మృతి చెందిన వారి సంఖ్య 71కి చేరింది. అలాగే గురువారం 24 గంటల వ్యవధిలో 9,986 మంది నుంచి నమూనాలు సేకరించినట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలియజేసింది. ఇప్పటివరకూ కరోనా నుంచి 2,273 మంది డిశ్చార్జి కాగా.. 1033 మంది బాధితులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.