కరోనాకు విరుగుడు.. ‘క్యాష్‌’ని వాడకపోవడమేనా!

| Edited By:

Mar 05, 2020 | 4:18 PM

ఈ వైరస్ సోకకుండా పలు విధానాలను అమలు పరుస్తున్నారు. అందులో ముఖ్యమైనది.. 'క్యాష్‌లెస్' ఒకటి. చేతుల ద్వారా.. డబ్బు మారుతుంది కాబట్టి.. దాని ద్వారా వైరస్ వ్యాపించే ప్రమాదముంది..

కరోనాకు విరుగుడు.. క్యాష్‌ని వాడకపోవడమేనా!
Follow us on

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ అతి భయంకరంగా తయారైంది. ఎక్కడ చూసినా దీనికి గురించే ప్రత్యేక చర్చలు జరుగుతున్నాయి. అందులోనూ.. ఈ వైరస్ ఇప్పుడు భారత్‌లోనూ ఎంటర్‌ అవడంతో.. ప్రజలందరూ భయాందోళనకు గురవుతున్నారు. అలాగే ప్రభుత్వ అధికారులు కూడా.. వైరస్ రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ.. ప్రత్యేక సూచనలు చేస్తున్నారు.

చైనాలోని ఊహాన్‌లో మొదలైన ఈ వైరస్.. థాయ్‌ల్యాండ్, ఇరాన్, నేపాల్, దక్షిణ కొరియా, ఇరాన్, ఇటలీ, బ్రిటన్, అమెరికా, జపాన్, భారత్‌లను తాకింది.దీంతో.. దేశ రాజధాని ఢిల్లీతో సహా కరోనా సోకిన ప్రాంతాల్లో హైఅలెర్ట్‌ను ప్రకటించారు. అలాగే పలు స్కూళ్లకు సెలవులు కూడా ప్రకటించారు అధికారులు.

అయితే ఈ వైరస్ సోకకుండా పలు విధానాలను అమలు పరుస్తున్నారు. అందులో ముఖ్యమైనది.. ‘క్యాష్‌లెస్’ ఒకటి. చేతుల ద్వారా.. డబ్బు మారుతుంది కాబట్టి.. దాని ద్వారా వైరస్ వ్యాపించే ప్రమాదముంది. కాబట్టి కాంటాక్టెలెస్‌ కార్డ్స్‌తో కరోనా వైరస్ వ్యాప్తి ప్రమాదం తగ్గుతుందంటున్నారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం పలు దేశాల్లోని బ్యాంకులు కరెన్సీ నోట్లపై కరోనా ప్రభావం రాకుండా ఉండేందుకు అల్ట్రావైలెట్ లైట్‌ని వినియోగించడం ప్రారంభించారు.