వలస కార్మికుల దుస్థితి.. కాంగ్రెస్ పిటిషన్.. కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం

| Edited By: Pardhasaradhi Peri

May 27, 2020 | 4:52 PM

ఇండియాలో కరోనా కేసులు తామర తంపరగా పెరిగిపోతుండగా లాకా డౌన్ వల్ల వలస కార్మికుల దుస్థితి ఇంకా ఇప్పటికీ దారుణంగా ఉంది. తమ స్వస్థలాలకు వెళ్లేందుకు వాళ్ళు నానా పాట్లూ పడుతున్నారు...

వలస కార్మికుల దుస్థితి.. కాంగ్రెస్ పిటిషన్.. కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం
Follow us on

ఇండియాలో కరోనా కేసులు తామర తంపరగా పెరిగిపోతుండగా లాకా డౌన్ వల్ల వలస కార్మికుల దుస్థితి ఇంకా ఇప్పటికీ దారుణంగా ఉంది. తమ స్వస్థలాలకు వెళ్లేందుకు వాళ్ళు నానా పాట్లూ పడుతున్నారు. మండుతున్న ఎండల్లో రైళ్లు, బస్సుల కోసం  గంటల తరబడి ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ దీప్ సింగ్ సూర్జేవాలా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తూ.. వారి దుస్థితిపై కేంద్రం, రాష్ట్రాలు జోక్యం చేసుకునేలా చూడాలని, వారి ఉపాధికి వెంటనేఓ  కార్యాచరణ ప్రణాళిక చేపట్టేలా ఆదేశించాలని అభ్యర్థించారు. వలస జీవుల సంక్షేమం కోసం దేశ వ్యాప్త ప్లాన్ అమలయ్యేలా చూడాలని ఆయన కోరారు. ఈ పిటిషన్ పై అత్యవసరంగా రేపే విచారణ జరగాలని కూడా విజ్ఞప్తి చేశారు. కాగా లాక్ డౌన్ కారణంగా ఇంకా వివిధ రాష్ట్రాల్లో చిక్కుబడిన ఈ కార్మికులకు షెల్టర్లు, ఆహార వసతి కల్పించాలని, వారిని స్వస్థలాలకు తరలించేలా చూడాలని ముగ్గురు సభ్యులతో కూడిన బెంచ్ నిన్న కేంద్రానికి, రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసింది. ఎలాంటి చర్యలు తీసుకున్నారో 48 గంటల్లోగా లేదా గురువారం లోగా వివరించాలని ఆదేశించింది. లాక్ డౌన్ వల్ల పార్లమెంట్ సమావేశాలు లేని కారణంగా తాను సుప్రీంకోర్టుకెక్కవలసివచ్చిందని రణదీప్ సింగ్ సూర్జేవాలా తన పిటిషన్ లో పేర్కొన్నారు.