తెలంగాణలో రేషన్ బియ్యం నిలిపివేత.. ఇదే కారణం..

| Edited By:

Mar 27, 2020 | 12:47 PM

తెలంగాణ రాష్ట్రంలో రేషన్ బియ్యం సరఫరా నిలిచిపోయింది. గురువారం నుంచి హైదరాబాద్ మినహా అన్ని రాష్ట్రాల్లోనూ లబ్ధిదారులకు రేషన్ బియ్యం పంపిణీ ప్రక్రియ మొదలవగా.. మధ్యాహ్నాం 3 గంటలకే రాష్ట్ర పౌరసరఫరాల నుంచి వచ్చిన ప్రత్యేక ఆదేశాల మేరకు..

తెలంగాణలో రేషన్ బియ్యం నిలిపివేత.. ఇదే కారణం..
Follow us on

తెలంగాణ రాష్ట్రంలో రేషన్ బియ్యం సరఫరా నిలిచిపోయింది. గురువారం నుంచి హైదరాబాద్ మినహా అన్ని రాష్ట్రాల్లోనూ లబ్ధిదారులకు రేషన్ బియ్యం పంపిణీ ప్రక్రియ మొదలవగా.. మధ్యాహ్నాం 3 గంటలకే రాష్ట్ర పౌరసరఫరాల నుంచి వచ్చిన ప్రత్యేక ఆదేశాల మేరకు వీటిని నిలిపివేశారు. అయితే బియ్యం పంపిణీ నిలిపివేతకు సరైన కారణాలు తెలుపలేదు డీలర్లు. దీంతో ప్రజల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. మొత్తంగా 2.80 కోట్ల మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 12 కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేసేలా పౌర సరఫరాల శాఖ చర్యలు చేపట్టింది.

అయితే ఈ పంపిణీలో లబ్ధిదారులు ఒకే దగ్గర గుమికూడకుండా వార్డుల వారీగా, టోకెన్ పద్దతిన పంపిణీ మొదలు పెట్టారు. ఉచిత బియ్యం కావడంతో కొన్ని చోట్ల జనాలు ఎగబడ్డారు. 20 మందికి మించి రావద్దని విన్నవించినా వందల సంఖ్యలో ఎగబడటంతో ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో వైరస్ మరింత ప్రబలే అవకాశం ఉన్నందున మధ్యలోనే బియ్యం పంపిణీని ఆపివేసినట్లు సమాచారం. మరో పక్క ఈ-పాస్, బయోమెట్రిక్ విధానం రద్దు చేసి కీ రిజిష్టర్ ఆధారంగా పంపిణీకి అవకాశం ఇవ్వాలని రేషన్ డీలర్ల సంఘం సైతం విన్నవించింది. అలా అయితేనే కరోనా కట్టడికి సాధ్యమవుతుందని తెలిపింది. కాగా ఈ మేరకు బియ్యం పంపిణీకి ఎలాంటి చర్యలు తీసుకుంటారో.. శుక్రవారం స్పష్టత రానుంది.

ఇవి కూడా చదవండి: 

ఏ లక్షణాలు లేకున్నా కరోనా వచ్చింది.. హైదరాబాద్ కోవిడ్ బాధితుడు చెప్పిన షాకింగ్ నిజాలు

జగన్ ప్రభుత్వానికి పవన్ మరో డిమాండ్.. ఈఎమ్‌ఐ చెల్లింపులు పొడిగించాలని..

వైరల్ న్యూస్: కరోనా ఉంది నాన్నా.. బయటకెళ్లొద్దంటూ.. బుడ్డోడి ఆవేదన

ఇది పచ్చి అబద్ధం.. ఈ సమయంలోనూ నాపై రూమర్లు ప్రచారం చేయడం దారుణం

ఏప్రిల్ 15 తరువాత కూడా లాక్‌డౌన్ కంటిన్యూ?

కరోనా వైరస్ తొందరగా వ్యాపించే ప్రదేశాలు ఇవే.. జాగ్రత్తగా ఉండండి!

కరోనా విజృంభణ: టీఆర్ఎస్ నేతల కీలక నిర్ణయం.. రూ.500 కోట్ల విరాళం

కరోనా ఎఫెక్ట్: పెరిగిన కండోమ్స్, ఐపిల్స్ సేల్స్