ఇలా ఎత్తేశారో లేదో.. పెళ్లికి రెడీ అవుతున్న జంటలు..!కానీ అలా నిరూపించుకుంటేనే చేసుకోవచ్చట..

| Edited By: Pardhasaradhi Peri

Apr 10, 2020 | 7:34 PM

కరోనా.. ఇది ప్రపంచ వ్యాప్తంగా అలజడి సృష్టిస్తున్న వైరస్‌. ఇది ఇప్పటికే దాదాపు లక్ష మంది ప్రాణాలను తీయగా.. మరో 15లక్షల మంది వరకు ఆస్పత్రి పాలయ్యారు. ఇక వైరస్‌ను నియంత్రించేందుకు ప్రభుత్వాలు లాక్‌డౌన్‌లు విధిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అనేక కార్యక్రమాలు ఆగిపోయాయి. అందులో పెళ్లిళ్లు కూడా చాలా ఉన్నాయి. ఇక ఈ వైరస్‌ పుట్టిన వూహాన్‌ నగరంలో కూడా అనేక పెళ్లిళ్లు ఆగిపోయాయట.తాజాగా.. అక్కడ కరోనా కంట్రోల్‌ అవ్వడంతో.. రెండు రోజుల క్రితం […]

ఇలా ఎత్తేశారో లేదో.. పెళ్లికి రెడీ అవుతున్న జంటలు..!కానీ అలా నిరూపించుకుంటేనే చేసుకోవచ్చట..
Follow us on

కరోనా.. ఇది ప్రపంచ వ్యాప్తంగా అలజడి సృష్టిస్తున్న వైరస్‌. ఇది ఇప్పటికే దాదాపు లక్ష మంది ప్రాణాలను తీయగా.. మరో 15లక్షల మంది వరకు ఆస్పత్రి పాలయ్యారు. ఇక వైరస్‌ను నియంత్రించేందుకు ప్రభుత్వాలు లాక్‌డౌన్‌లు విధిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అనేక కార్యక్రమాలు ఆగిపోయాయి. అందులో పెళ్లిళ్లు కూడా చాలా ఉన్నాయి. ఇక ఈ వైరస్‌ పుట్టిన వూహాన్‌ నగరంలో కూడా అనేక పెళ్లిళ్లు ఆగిపోయాయట.తాజాగా.. అక్కడ కరోనా కంట్రోల్‌ అవ్వడంతో.. రెండు రోజుల క్రితం అక్కడ లాక్‌డౌన్‌ ఎత్తివేశారు. దీంతో అక్కడ మళ్లీ పెళ్లిళ్ల సందడి మొదలైంది. ఈ రెండు రోజుల్లోనే వివాహాల కోసం.. ఎప్పటికంటే.. దాదాపు 300శాతం పెరిగినట్లు అక్కడి అధికారిక వర్గాలు తెలిపాయి. పెళ్లిళ్ల కోసం.. అప్లై చేసే అలిపే యాప్ కూడా ఈ విషయాన్ని వెల్లడించింది. ఊహించిన దానికంటే ఎక్కువగా అప్లికేషన్స్ రావడంతో యాప్‌ ఫ్రీజ్ అయ్యిందట. దీంతో అప్లికేషన్స్ ప్రాసెస్ కాస్త నెమ్మదిస్తోందని అధికారులు తెలిపారు.
కాగా.. కరోనా ప్రభావంతో.. వూహాన్‌లో 76 రోజులపాటు లాక్‌డౌన్‌ విధించింది చైనా సర్కార్. దీంతో అక్కడ ఎలాంటి శుభకార్యాలు జరగలేదు. మరోవైపు ఫిబ్రవరి, మార్చి నెలల్లో పెళ్లిళ్ల కోసం అప్లికేషన్స్‌ను పూర్తిగా నిలిపివేశారు.